AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot: ఈ 5 ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచాలంటే.. మీరు బీట్‌రూట్‌ తీసుకోవడం మంచిది..! ఎందుకంటే..

మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటే ఆహారాలలో బీట్‌రూట్ కూడా ఒకటి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల అధిక బరువు సమస్యను అధిగమించడంలో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సంరక్షణ..

Beetroot: ఈ 5 ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచాలంటే.. మీరు బీట్‌రూట్‌ తీసుకోవడం మంచిది..! ఎందుకంటే..
Beetroot For Health
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 13, 2023 | 8:45 AM

Share

ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఆహార పదార్థాలు మన చుట్టూనే లభ్యమవుతుంటాయి. మనం వాటి గురించి తెలుసుకుని నిత్యం మన ఆహారంలో భాగంగా తీసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా గడిపేయవచ్చు. అలా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటే ఆహారాలలో బీట్‌రూట్ కూడా ఒకటి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల అధిక బరువు సమస్యను అధిగమించడంలో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సంరక్షణలో, రక్తహీనతను దూరం చేయడంలో బీట్‌రూట్ కీలకపాత్ర పోషిస్తుంది.

ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇది శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్రమం తప్పకుండా బీట్‌రూట్ తీసుకుంటే.. గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి కూడా వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది. బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

  1. బీట్‌రూట్‌లో బీటాలైన్స్ అనే ఫైటోన్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాల కారణంగా కడుపులోని దీర్ఘకాలిక మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. బీట్‌రూట్ తీసుకోవడంవల్ల కీళ్ల నొప్పి కూడా త‌గ్గుతుంది.
  2. బీట్‌రూట్‌ జ్యూస్‌లో గ్లూటామైన్, అమైనో ఆమ్లాలు, 3.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్దకం, పేగు వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను నివారిస్తుంది. బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు ఎనర్జీగా ఉంచుతుంది. ఇంకా జీవక్రియల‌ను మెరుగుపరుస్తుంది.
  3. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్త నాళాలను ముడుచుకోకుండా చేయ‌డానికి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతాయి. తద్వారా మెదడు పనితీరు వృద్ధి చెందుతుంది.
  4. అదేవిధంగా బీట్‌రూట్‌ల‌లో ఉండే డైటరీ నైట్రేట్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో, గుండెపోటు నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది.
  5. బీట్‌రూట్‌లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేసి, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. అంతేకాక అసాధారణ కణాల పెరుగుదలను, కణితి కణాల విభజనను తగ్గిస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ బి6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్‌, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతాయి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి