Amla Side Effects: ఈ సమస్యలన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రమాదం పొంచిఉన్నట్లే..

చర్మ సంరక్షణలో, కేశ సంరక్షణలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ క్రమంలోనే మనకు ఉసిరి వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన ఉసిరిని కొందరు..

Amla Side Effects: ఈ సమస్యలన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రమాదం పొంచిఉన్నట్లే..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఆమ్లాలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం నిరోధించడంలో సహాయపడవచ్చు.
Follow us

|

Updated on: Jan 13, 2023 | 10:21 AM

భారత్‏లో ఎక్కువగా ఉసిరిని ఊరగాయకు ఉపయోగిస్తుంటారు. అదే సమయంలో కొంతమంది నేరుగా తినడానికే ఇష్టపడతుంటారు. ఇక మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో ఉసిరి పొడి కూడా లభిస్తోంది. కేవలం ఉసిరికాయను పచ్చడిగానే కాకుండా జ్యూస్‌గా, మురబ్బాగా, సిరప్‌గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను తేనెలో నానబెట్టి కూడా తింటారు. రసం తీసి తాగినా, చూర్ణంగా తీసుకున్నా, మురబ్బా చేసుకుని చప్పరించినా, రోట్లో పచ్చడి చేసినా.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. మన చర్మ సంరక్షణలో, కేశ సంరక్షణలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ క్రమంలోనే మనకు ఉసిరి వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఉసిరిని కొందరు తినకూడదు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మరి ఎవరెవరు ఉసిరికాయలకు దూరంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దగ్గు, జలుబు: దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవాళ్ళు ఉసిరికి దూరంగా ఉండడం మంచిది. ఉసిరి శరీరానికి చల్లని ప్రభావాన్ని కలిగిస్తుంది. అందువల్ల జలుబు, దగ్గు ఉన్నవాళ్లు దీనిని తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి

లో బ్లడ్ షుగర్: షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఉసిరికి దూరంగా ఉండడం మంచిది. ఉసిరిని తీసుకోవడం వలన అది షుగర్ లెవెల్స్‌ని మరింత తగ్గించే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు ఉసిరిని తీసుకోరు.

కిడ్నీ సమస్యలు: కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా ఉసిరిని తీసుకోకూడదు. ఇది శరీరంలో సోడియం స్థాయిలను పెంచేస్తుంది. దీంతో సమస్యలు మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది.

పొత్తికడుపు వాపు: పొత్తికడుపులో వాపు సమస్యతో బాధపడే వాళ్ళు ఉసిరికి దూరంగా ఉండాలి.

ఒక్కొక్కసారి మనం తీసుకునే ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటాము. చాలా ప్రయోజనాలు ఉంటాయి కదా అని ఎక్కువ మోతాదులో తీసేసుకుంటూ కూడా ఉంటాము. కానీ కొన్ని రకాల సమస్యల వలన ఆహార పదార్థాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేసి అప్పుడు మాత్రమే మీరు ఆహార పదార్థాలను తీసుకోండి. లేదంటే మీ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..