AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya for Skincare: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం బొప్పాయిని ఇలా ఉపయోగిస్తే.. మెరిసిపోయే చర్మం మీ సొంతం..

చర్మ సంరక్షణ కోసం కాస్మటిక్స్ కంటే మనం నిత్యం తినే పండ్లు, పప్పు దినుసులే ఎంతో మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా బొప్పాయి మన చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన బొప్పాయి దాదాపు

Papaya for Skincare: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం బొప్పాయిని ఇలా ఉపయోగిస్తే.. మెరిసిపోయే చర్మం మీ సొంతం..
Papaya
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 13, 2023 | 11:52 AM

Share

చర్మసంరక్షణ కోసం నిత్యం ఉపయోగించే కాస్మొటిక్స్ చర్మానికి మంచివి కాదని తెలిసినా చాలామంది వాటినే ఉపయోగిస్తుంటారు. సహజంగా చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలియకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుత కాలంలో వాతావరణం, మన జీవన వీధానం, ఆహారపు అలవాట్లు చర్మానికి అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. ఇక వాటి నుంచి చర్మాన్ని కాపాడుకోవడం కోసమే ఈ కాస్మటిక్స్ మీద ఆధారపడవలసి ఉంటుంది. అయితే చర్మ సంరక్షణ కోసం కాస్మటిక్స్ కంటే మనం నిత్యం తినే పండ్లు, పప్పు దినుసులే ఎంతో మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా బొప్పాయి మన చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన బొప్పాయి దాదాపు అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు మనకు ఎంతో ఉపయోగకరం, ఆరోగ్యదాయకంగా ఉంటాయి.

అంతేకాక బొప్పాయిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.  ఇంకా కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం,  సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో కలిగిన బొప్పాయి మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. మరి బొప్పాయితో ఉన్న ప్రయోజనాలేమిటో, దీనిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. కొద్దిగా బియ్యప్పిండి తీసుకొని అందులో బొప్పాయి గుజ్జుని చేర్చితే ఒక మిశ్రమంగా తయారవుతుంది. దీనిని ముఖ చర్మానికి రాసుకుంటే మొటిమలు మాయమవడంతో పాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
  2. బొప్పాయి గుజ్జులో ఒక చెంచా పచ్చిపాలు, తేనె, పసుపు, తులసి ఆకుల రసం కలుపుకొని ముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు తగ్గుతాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. బొప్పాయి గుజ్జుతో అర స్పూన్‌ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి చర్మానికి రాసుకుంటే  దానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అంది యవ్వనంగా కనిపిస్తారు.
  5. నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయను మీ సొంతం చేసుకున్నట్లే.
  6. బొప్పాయి పండుకు ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. అందుకోసం కోడిగుడ్డులోని తెల్లసొన కొద్దిగా తీసుకొని ఒకస్పూన్‌ బొప్పాయి గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట సేపు అలానే ఉంచుకొని ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. అలా వారానికి రెండు సార్లు చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి