బెల్ట్ చాలా టైట్ గా పెట్టుకునే వారికి అలెర్ట్..! మీ హెల్త్ రిస్కులో పడ్డట్లే..
పురుషులు టైట్ బెల్టులు ఎందుకు ధరించకూడదు..? దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..? ఎక్కువ కాలం టైట్ బెల్టులు వేసుకోవడం వల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా.. పొట్టపై నిరంతరం ఒత్తిడి పడి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఫర్టిలిటీ (సంతానోత్పత్తి) పైనా ఇది చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టైట్ బెల్టులు ధరించడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత (scrotal temperature) పెరుగుతుంది. వృషణాలు శరీరంలోని ఇతర భాగాల కంటే చల్లగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే శుక్రకణాల ఉత్పత్తి (Sperm production) సరిగ్గా జరగడానికి ఇది కీలకం. పొట్టపై టైట్ బెల్టు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువై వృషణాల పనితీరును బాగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శుక్రకణాల నాణ్యత తగ్గి సంతానం కలగడానికి ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. టైట్ బెల్టులు మధ్య వైపు భాగానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. రక్త ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల వృషణాలు ఇతర సంతానోత్పత్తి అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే పొట్ట కింది భాగం జనన భాగాల్లో (genital areas) ఎక్కువ కాలం ఒత్తిడి వల్ల వాపు, వెరికోసెల్ (వృషణాల్లోని రక్త నాళాల వాపు) లాంటి సమస్యలు రావచ్చు. ఇవి చివరికి పురుషుల సంతానోత్పత్తిని తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
టైట్ బెల్టులు ధరించడం వల్ల అరుగుదలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ఈ ఒత్తిడి వల్ల అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇవి చాలా అసౌకర్యంగా ఉంటాయి.
తరచుగా ఎక్కువసేపు టైట్ బెల్టులు ధరించడం మగవారిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. టైట్ బెల్టు పొట్ట చుట్టూ నిరంతరం ఒత్తిడి కలిగించడం వల్ల రక్త ప్రవాహం తగ్గి జనన అవయవాల సాధారణ పనితీరు దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి కారణంగా అజీర్ణం సమస్యలు కూడా రావొచ్చు.
ఈ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సౌకర్యవంతమైన తగిన సైజు కలిగిన బెల్టులు ధరించడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలోని గాలి ప్రవాహం మెరుగుపడి, అధిక ఉష్ణోగ్రత రావడం తగ్గుతుంది. ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు కొన్నిసార్లు విరామాలు తీసుకుని నడుము భాగంలో రక్త ప్రవాహం మెరుగుపరచుకోవాలి. బెల్టు లేకుండా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం.
పురుషుల సంతానోత్పత్తి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. మంచి ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, అలాగే పొగతాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను మానుకోవడం చాలా ముఖ్యం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)