AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Throat Cancer Symptoms:: మీకు ఆహారం మింగడంలో ఇబ్బంది ఉందా..? అయితే అప్రమత్తంగా ఉండండి.. ఈ వ్యాధులకు సంకేతం!

Throat Cancer Symptoms: ప్రస్తుతం రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. వాటిని ఎదుర్కొవాలంటే ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మారుతున్న జీవన శైలి..

Throat Cancer Symptoms:: మీకు ఆహారం మింగడంలో ఇబ్బంది ఉందా..? అయితే అప్రమత్తంగా ఉండండి.. ఈ వ్యాధులకు సంకేతం!
Throat Pain
Subhash Goud
|

Updated on: Sep 28, 2022 | 7:55 AM

Share

Throat Cancer Symptoms: ప్రస్తుతం రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. వాటిని ఎదుర్కొవాలంటే ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మారుతున్న జీవన శైలి విధానం, అధిక టెన్షన్‌, ఒత్తిడి, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లాంటి కారణాల వల్ల వివిధ వ్యాధులు వెంటాడుతున్నాయి. ముందే రకరకాల వైరస్లు వెంటాడుతున్నాయి. కరోనా కాలం నుంచి కొత్త కొత్త వైరస్లు వస్తుండటంతో జనాలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో కల్తీ ఉంటుంది. రోడ్డుపై ఉండే ఫాస్ట్ ఫుడ్ గానీ, ఇతర పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. తాజాగా ఉన్న ఆకు కూరలు, అప్పుడే వండిన పదార్థాలను తీసుకోవడం మంచిది. ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు పండ్లను తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

వ్యాధుల హెచ్చరిక సంకేతాలు: గొంతులో ఆహారాన్ని మింగడానికి ఇబ్బంది పడటం సాధారణంగా సమస్యగా భావించి చాలా మంది విస్మరిస్తుంటారు. ఆహారం మింగడంలో ఇబ్బంది లాంటి గొంతులో సమస్య ఉంటే అది థైరాయిడ్ క్యాన్సర్‌కు సంకేతం. థైరాయిడ్ క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాణాంతకం అని కూడా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్‌పై సకాలంలో చికిత్స తీసుకుంటే, ప్రాణాంతకమైన ప్రమాదాలను నివారించవచ్చు.

థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

థైరాయిడ్ క్యాన్సర్ అనేది గొంతులో వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్‌కు మ్యుటేషన్ కారణం. కణాలు చనిపోయి అవి కణితిని ఏర్పరుస్తాయి. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా, మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా, ఫోలిక్యులర్ కార్సినోమా, అనాప్లాస్టిక్ థైరాయిడ్ కార్సినోమా. లేకపోతే ఈ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం ప్రారంభం అవుతుంది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. లేకపోతే ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి క్యాన్సర్ వ్యాపించినట్లయితే దానిని నయం చేసుకోవాలంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా లకణాలు కలిగి ఉండి, గొంతులో నొప్పిగా ఉండి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. దీని వల్ల మీరు పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లు అవుతుంది.

థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది?

మెడలో థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది. థైరాయిడ్ అనేది అనేక ముఖ్యమైన హార్మోన్లను స్రవించే గ్రంధి. థైరాయిడ్ నుండి విడుదలయ్యే హార్మోన్లు రక్తపోటు, బరువు, జీవక్రియ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి.

థైరాయిడ్ లక్షణాలు:

దీని లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. తొలిదశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా, గొంతులో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, శోషరస వాపు, స్వరం బరువెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ ముందే ప్రమాదకరం కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు.

థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాలు

థైరాయిడ్ క్యాన్సర్ చాలా సందర్భాలలో ప్రాణాంతకం కాదు. థైరాయిడ్ క్యాన్సర్‌కు సకాలంలో చికిత్స అందించినట్లయితే, దానిని సులభంగా నయం చేయవచ్చు. కానీ అది మరింత పెరిగితే అది ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది. అందుకే సకాలంలో చికిత్స చేయడం అవసరం అంటున్నారు వైద్యులు. కొన్ని సందర్బాలలో క్యాన్సర్ ప్రమాదకరంగా ఉండకపోయినా.. ముందస్తుగా స్పందించి వైద్యులను సంప్రదించడం మంచిదని అంటున్నారు నిపుణులు. సకాలంలో చికిత్స తీసుకుంటే ఎంతో మంచిదని, దీని వల్ల ప్రాణాల నుంచి గట్టెక్కడం జరుగుతుందంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..