AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk – Honey: ఆరోగ్యానికి అమృతం, ఆ సమస్యలకు దివ్యౌషధం ఈ మిశ్రమం.. రోజూ తాగితే డబుల్ బెనిఫిట్స్..

పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తారు.

Milk - Honey: ఆరోగ్యానికి అమృతం, ఆ సమస్యలకు దివ్యౌషధం ఈ మిశ్రమం.. రోజూ తాగితే డబుల్ బెనిఫిట్స్..
Honey And Milk Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2022 | 6:48 AM

పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తారు. అయితే, కొంతమంది తీపి లేకుండా పాలు తాగితే.. మరికొందరు పంచదార కలిపిన పాలు తాగేందుకు ఇష్టపడుతారు. అలాంటి వారు పంచదార బదులు తీపి కోసం తేనె వాడితే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి మంచి పోషకాహారంగా పరిగణిస్తారు. దీని కారణంగా, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది: పాలు – తేనె కలిపి తాగడం వల్ల దాని కలయిక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనెలో ఉండే ప్రోటీన్-కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా.. పలు సమస్యలను దూరం చేస్తాయి.
  2. బరువు తగ్గుతుంది: ప్రస్తుత రోజుల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. చాలా మంది దానిని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. అలాంటి వారు ప్రతి రోజు పాలలో తేనె కలిపి తాగితే ఈ సమస్య కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీర బరువును నియంత్రించి ఊబకాయాన్ని దూరం చేస్తాయి.
  3. ఒత్తిడి దూరం: నేటి జీవనశైలి కారణంగా అనేక రకాల ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. మీరు కూడా ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతుంటే పాలు – తేనె మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలపడం వల్ల ఒత్తిడి అదుపులో ఉండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పరిశోధన ప్రకారం పాలు ఎముకలను బలపరుస్తాయి.. తేనె నరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.
  4. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: మీకు ఏదైనా శ్వాసకోశ సమస్య ఉంటే పాలు – తేనె మిశ్రమం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల ఎలాంటి శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటే పాలు, తేనె కలుపుకుని తాగాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ముఖం మెరుస్తుంది: మీ ముఖం నిగారింపు కోసం తేనె కలిపిన పాలను తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ముఖం మెరిసిపోయి సహజసిద్ధమైన కాంతిని సంతరించుకుంటుంది. దీనితో సౌందర్య సాధనాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..