Food Tips For Monsoon: వర్షాకాలం వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి.. ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి..
Food Tips For Monsoon: వర్షాకాలం వచ్చేసింది.. మొన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ వారు ఇప్పుడు తొలకరి చిరు జల్లులతో ఒక్కసారిగా కూల్ అయ్యారు. అయితే చల్లని ఈ జల్లుల వెనక వ్యాధులు కూడా...
Food Tips For Monsoon: వర్షాకాలం వచ్చేసింది.. మొన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ వారు ఇప్పుడు తొలకరి చిరు జల్లులతో ఒక్కసారిగా కూల్ అయ్యారు. అయితే చల్లని ఈ జల్లుల వెనక వ్యాధులు కూడా పొంచి ఉన్నాయనే విషయం మీకు తెలుసా? వర్షాకాలంలో తడవకుండా తప్పించుకోవడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ఆఫీసు, వ్యాపారలకోసం బయటకు వెళ్లే వారు వాన కాలంలో ఇబ్బందులు పడుతుంటారు. దీంతో సాధారణంగా రోగాల బారిన పడుతుంటారు. మరి ఇంట్లోనే ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులను సహజ సిద్ధంగా చెక్ పెడుతూ.. రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* పసుపు చక్కటి యాంటీ బయోటిక్‌లా పని చేస్తుందనే విషయం తెలిసిందే. పసుపులో ఉండే అనేక ఔషధ గుణాలు మనకు అందాలనే ఉద్దేశంతోనే పసుపును మన జీవితంలో ఓ భాగం చేశారు పెద్దలు. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు రోగననిరోధక శక్తి పెరగడంలో ఉపయోగపడతాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు.
* మనం వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా.. ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.
* వర్షాకాలంలో ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాల్లో నల్ల మిరాయాలు ఒకటి. ఇందులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్నాయి. నల్ల మిరియాల్లో ఉండే.. ఫాస్ఫరస్, మాంగనీస్, కెరోటీన్, సెలీనియం, విటమిన్ కెలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
* లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు సమస్యలు లవంగంతో తగ్గుతాయి. వీటిలో ఉండే.. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్లూ సమస్యను తగ్గిస్తుంది.
Also Read: Healthy Lungs : మీ లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా చేయండి..! పెద్దగా ఖర్చు కూడా కాదు..?
Weight Loss Tips: బరువు తగ్గడం కోసం డైట్ చేసేవారు ఈ పండ్లను తింటే మరింత బరువు పెరుగుతారట
Diet Tips For Piles: పైల్స్‌తో నరకం చూస్తు్న్నారా?.. మనం తినే ఆహారంతోనే చెక్ పెట్టండి ఇలా..!