AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Lungs : మీ లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా చేయండి..! పెద్దగా ఖర్చు కూడా కాదు..?

Healthy Lungs : కరోనా సోకిందంటే ముందుగా దెబ్బతినేవి ఊపిరితిత్తులే. వైరస్ ముందుగా శ్వాస వ్యవస్థపైనే దాడి

Healthy Lungs : మీ లంగ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా చేయండి..! పెద్దగా ఖర్చు కూడా కాదు..?
Healthy Lungs
uppula Raju
|

Updated on: Jun 13, 2021 | 2:43 PM

Share

Healthy Lungs : కరోనా సోకిందంటే ముందుగా దెబ్బతినేవి ఊపిరితిత్తులే. వైరస్ ముందుగా శ్వాస వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే ఊపిరితిత్తులను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా సెకండ్ వేవ్‌లో అందరం చూస్తూనే ఉన్నాం చాలామంది ఊపిరందక ప్రాణాలు వదులుతున్నారు. ఆక్సిజన్ అత్యవసరమవుతుంది. అందుకే మన ఊపిరితిత్తులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటి ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆస్పత్రులకు వెళ్లి పెద్దగా ఖర్చు కూడా చేయనవసరం లేదు. ఆ హెల్త్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓ కప్పు నీటిలో 2 యాలకులు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 10 నిమిషాలు వేడి చేసి తాగితే బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ కంట్రోల్‌లో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. ఇది ఊపిరి తిత్తులకు కూడా మేలు చేస్తుంది. 2. అల్లం టీలో కొద్దిగా పసుపు వేసుకొని తాగాలి. లేదా వేడిపాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగాలి. ఇది జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఊపిరి తిత్తులకు గాలి బాగా వెళ్లేలా చేస్తుంది. ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి. 3. పుదీనా ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని తాగితే గొంతులో మంట, గరగర వంటివి పోయి గొంతు చల్లగా అవుతుంది. రిలీఫ్‌ లభిస్తుంది. ఇది ఊపిరి తిత్తులకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది. 4. తేనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో వేడిని బాగా తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో చెడు వ్యర్థాలను తరిమేస్తాయి. రోజూ గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూన్‌ తేనె వేసుకొని తాగేయండి. 5. ప్రతి రోజు గ్రీన్‌ టీ తాగితే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. బాడీకి యాంటీ-ఆక్సిడెంట్స్‌ బాగా ఉపయోగపడుతాయి. ఇవి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతాయి.

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

Srisailam : శ్రీశైలంలో బయటపడుతోన్న ప్రాచీనకాలం నాటి అద్భుతాలు, మొన్న గుప్తనిధులు.. నేడు అజరామరమైన తామ్ర శాసనాలు

Coconut Milk Biryani : కోనసీమ స్టైల్ లో కొబ్బరి పాలతో టేస్టీ టేస్టీ కొబ్బరి బిర్యానీ తయారీ..