Back Pain Relief Tips: బ్యాక్ పెయిన్‌తో సతమతమవుతున్నారా..? ఈ సమస్యకు సహజంగా ఇలా చెక్ పెట్టండి..
Back Pain Relief Tips: ఇటీవలి కాలంలో వెన్ను నొప్పి సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న పనిశైలి, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల వెన్న నొప్పి సమస్య ఎక్కువవుతోంది...
Back Pain Relief Tips: ఇటీవలి కాలంలో వెన్ను నొప్పి సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న పనిశైలి, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల వెన్న నొప్పి సమస్య ఎక్కువవుతోంది. అయితే వెన్ను నొప్పి వచ్చినప్పుడల్లా.. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటారు. అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే కొన్ని సహజ పద్ధతుల ద్వారా వెన్ను నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. సహజంగా వెన్ను నొప్పిని తగ్గించే కొన్ని చిట్కాలపై ఓ లుక్కేయండి..
* ఆవనూనెతో మసాజ్ చేయడం ద్వారా మంచి రిలీఫ్ లభిస్తుంది. నొప్పి ఉన్న చోట కాస్త ఆవనూనెతో మర్దనా చేసి గోరు వెచ్చని నీరు నడముపై పోసుకోవాలి. ఇలా చేస్తే వెన్న నొప్పి సమస్య నుంచి కొంత కాలంలోనే బయటపడొచ్చు.
* నొప్పి ఉన్న చోట హాట్ వాటర్ బ్యాగ్‌తో కాపడం చేయాలి. ఇలా క్రమం తప్పకుడా చేస్తే వెన్న నొప్పి తగ్గుతుంది.
* ఇక తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒంటి నొప్పులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా.. ప్రతి రోజూ ఆహారంలో అల్లం ఉండేలా చూసుకుంటే నొప్పుల నుంచి బయటపడొచ్చు. రోజూ ఉదయం లేవగానే అల్లం రసాన్ని నేరుగా లేదా.. అల్లం కాచిన నీటిని తాగితే నొప్పులకు చెక్ పెట్టొచ్చు.
* సహజంగా వెన్న నొప్పిని తగ్గించుకోవాలంటే కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి 5 నిమిషాల పాటు మరగించాలి అనంతరం.. ఈ మిశ్రమాన్ని వెన్న నొప్పి ఉన్న చోట మర్ధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు మర్దన చేయాలి.
* ప్రతిరోజూ స్నానం చేసే ముందు గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా నొప్పులకు చెక్ పెట్టవచ్చు.