AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: చలికాలంలో గుండె పోటు ప్రమాదం.. ఈ జాగ్రత్తలతో చెక్‌ పెట్టొచ్చు..

చలికాలం వచ్చేసింది. ఇప్పటికే చలి తన పంజాను విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికాలం వస్తు వస్తూ తన వెంటనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను వెంట తీసుకువస్తుంది. మరీ ముఖ్యంగా..

Heart Attack: చలికాలంలో గుండె పోటు ప్రమాదం.. ఈ జాగ్రత్తలతో చెక్‌ పెట్టొచ్చు..
Heart Attack
Narender Vaitla
|

Updated on: Nov 05, 2022 | 11:53 AM

Share

చలికాలం వచ్చేసింది. ఇప్పటికే చలి తన పంజాను విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికాలం వస్తు వస్తూ తన వెంటనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను వెంట తీసుకువస్తుంది. మరీ ముఖ్యంగా చలి కాలం హృద్రోగులకు ఎంతో కీడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే..

* చలికాలంలో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా ఉదయం 8 గంటలకు ముందు రాత్రి 6 గంటల తర్వాత బయట తిరగకుండా ఉండాలి.

* వింటర్‌లో కచ్చితంగా ఉన్ని దుస్తువులను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల, చేతులు, పాదాలను కవర్‌ చేస్తూ క్యాప్‌, గ్లౌజ్‌లు వంటి వాటిని ధరించాలి.

ఇవి కూడా చదవండి

* చలి కాలంలో జ్వరాలు వస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* సహజంగానే ఆల్కహాల్‌ శరీరంలో రక్తప్రసరణను ప్రభావితం చేస్తుందనే విషయం తెలిసిందే. ఆల్కహాల్‌ శరీరాన్ని వేడి చేస్తుంది. శరీరంలో వేడి, బయట చల్లటి వాతావరణం ఉండడం కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* చలికాలంలో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చేయాలి. దీనివల్ల గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. వాకింగ్‌, జాగింగ్‌ వంటి వాటిని కొనసాగించాలి. అయితే ఉదయం పూట మంచు కురిసే సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడం ఉత్తమం.

* చలికాలంలో రక్తపోటను క్రమం తప్పకుండా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. బీపీలో అనూహ్య మార్పులు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాలి.

* సాధారణంగా చలికాలం నీరు తక్కువ తాగుతుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపడ నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జాగా పండ్లు, కూరగాయలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన సూచనలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచన మేరకే నిర్ణయాన్ని తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..