AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీలో ఈ లక్షణాలున్నాయా.? అయితే మెగ్నీషియం లోపం ఉన్నట్లే..

ఎముకలు బలంగా ఉంచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక వ్యవస్త సరిగ్గా పనిచేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరుతో పాటు మానసిక స్థితిని మెగ్నీషియం ప్రభావితం చేస్తుంది. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే వెంటనే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే కొన్ని సందర్భాల్లో బీపీ కంట్రోల్‌ తప్పుతుంది. గుండె చప్పుడు నియంత్రణ తప్పుతుంది...

Health: మీలో ఈ లక్షణాలున్నాయా.? అయితే మెగ్నీషియం లోపం ఉన్నట్లే..
Magnesium Deficiency
Narender Vaitla
|

Updated on: Dec 25, 2023 | 11:07 PM

Share

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో విటమిన్లు, ఖనిజాలు అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఏవీ లోపించినా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. శరీరంలో కీలక పాత్ర పోషించే వాటిలో మెగ్నీషియం ఒకటి. కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా, శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సరిగ్గా సాగాలన్నా మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఎముకలు బలంగా ఉంచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక వ్యవస్త సరిగ్గా పనిచేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరుతో పాటు మానసిక స్థితిని మెగ్నీషియం ప్రభావితం చేస్తుంది. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే వెంటనే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే కొన్ని సందర్భాల్లో బీపీ కంట్రోల్‌ తప్పుతుంది. గుండె చప్పుడు నియంత్రణ తప్పుతుంది. ఇక కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించొచ్చు, అవేంటంటే..

* రక్తలంలో మెగ్నీషియం లోపిస్తే శరీరంలో త్వరగా అలసిపోతుంది. ఎలాంటి పని చేయకపోయినా శరీరంలో అలసిపోతుంది, నిత్యం నిస్సత్తువగా ఉంటారు. శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

* శరీరంలో మెగ్నీషియం సరిపడ లేకపోతే ఆకలి ఉండదు. దీర్ఘకాలంగా ఆకలిలేమీతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మెగ్నీషియం సరపడ ఉండకపోతే ఆకలి వేయదు.

* శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. కండరాలు బలహీనంగా మారుతాయి. మెగ్నీషియం లోపిస్తే, పొటాషియం స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది కండరాల తిమ్మిరి, కండరాల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

* శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గితే.. హృదయ స్పందన రేటుపై ప్రభావం పడుతుంది. గుండె కొట్టుకునే వేగం సాధారణం కంటే ఎక్కువ ఉంటే అది మెగ్నీషియం లోపానికి సూచికగా భావించాలి.

* నిత్యం తలనొప్పి, మైకం, తల తిరిగినట్లు అనిపిస్తుంటే మెగ్నీషియం లోపం ఉందని భావించాలి. తీవ్రమైన ఆందోళన వంటివి వెంటాడుతుంటే కూడా మెగ్నీషియం లోపమేనని భావించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us