Health: చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా.? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే..
Health: చాయ్, బిస్కెట్ ఈ రెండింటి కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉదయం, సాయత్రం అంటూ తేడా లేకుండా టీలో ఎంచక్కా బిస్కట్లను ముంచుకొని తింటుంటారు. మనలో చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. అయితే అతి ఏదైనా అనర్థానికి దారి తీస్తుందన్నట్లు..
Health: చాయ్, బిస్కెట్ ఈ రెండింటి కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉదయం, సాయత్రం అంటూ తేడా లేకుండా టీలో ఎంచక్కా బిస్కట్లను ముంచుకొని తింటుంటారు. మనలో చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. అయితే అతి ఏదైనా అనర్థానికి దారి తీస్తుందన్నట్లు ఈ అలవాటు అతిగా చేసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్, బిస్కెట్‌లను కలిపి ఎక్కువ కాలం తీసుకుంటే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వీటి వల్ల కలిగే నష్టం ఏంటి.? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న వివరాల్లోకి వెళితే..
సాధారణంగా అన్ని బిస్కెట్స్‌లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. టీలో కలిపి తీసుకోవడం వల్ల తెలియకుండానే ఎక్కువగా బిస్కెట్స్ తింటుంటారు. దీంతో దీర్ఘకాలం బిస్కెట్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టీతో పాటు తియ్యగా ఉండే బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే బిస్కెట్స్‌ను ఎక్కువగా రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండదు. దీంతో మోతాదుకు మించి బిస్కెట్స్ తింటే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇక మైదా పిండితో తయారు చేసే బిస్కెట్లతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా విపరీతంగా బిస్కెట్స్ టీ కలిపి తీసుకోవడం వల్ల దంతాలకుండే ఎనామిల్ దెబ్బ తింటుంది.
Note: బిస్కెట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయనేది నిజమే అయినప్పటికీ. పరిమిత స్థాయిలో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఉండే బిస్కెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని బిస్కెట్లను మానేయకుండా ఓసారి వైద్యుల సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలి.
Also Read: Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!
Sai Dharam Tej: వెల్ కమ్ బ్యాక్ తేజ్.. ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చిన మెగా మేనల్లుడు.. షూటింగ్ షురూ