AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: వెల్ కమ్ బ్యాక్ తేజ్.. ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చిన మెగా మేనల్లుడు.. షూటింగ్ షురూ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకు చాలా కాలం అయ్యింది. గత సంవత్సరం వినాయక చవితి రోజున తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే..

Sai Dharam Tej: వెల్ కమ్ బ్యాక్ తేజ్.. ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చిన మెగా మేనల్లుడు.. షూటింగ్ షురూ
Tej
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2022 | 4:57 PM

Share

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కెమెరా ముందుకు చాలా కాలం అయ్యింది. గత సంవత్సరం వినాయక చవితి రోజున తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. రిపబ్లిక్ సినిమా సమయంలో తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తేజ్ కు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందారు. గత ఏడాది సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పుడు తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల పలు కార్యక్రమాలకు కూడా తేజ్ హాజరయ్యాడు. అలాగే రీసెంట్ గా ఫోటో షూట్ లో కూడా చేశారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దాదాపు ఏడు నెలలు విశ్రాంతి తీసుకున్న తేజ్ . ఇటీవలే విజయవాడ కనక దుర్గ అమ్మవారిని ఫ్యామిలీతో కలిసి వెళ్లి దర్శించుకున్నాడు. ఇక ఇప్పుడు కెమెరా ముందుకు రానున్నాడు. గతంలో మార్చి 28న మంగళవారం ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు తేజ్. చెప్పినట్టుగానే నేడు తన అప్ కమింగ్ మూవీ అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు తేజ్. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు (మంగళవారం) నుంచి మొదలైంది. తాజాగా ఓ వీడియోని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. సెట్ లో వున్న గుడిలో పూజ అనంతరం సాయి ధరమ్ తేజ్ సెట్ లోకి అడుగుపెట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..