AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లే..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు చాలా రోజుల తర్వాత కానీ తెలియదు. కానీ కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరిగినట్లు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లే..
High Cholesterol Symptoms
Narender Vaitla
|

Updated on: Oct 08, 2022 | 7:47 AM

Share

శరీరంలో జీవసంబంధ విధులు నిర్వర్తించాలంటే కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. అయితే ఈ కొవ్వులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుడ్‌ కొలెస్ట్రాల్‌ మరొకటి బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హృద్రోగ సమస్యల నుంచి అధిక బరువు వరకు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మరీ ముఖ్యంగా మారిన జీవన విధానం, ఆహారపు అలావాట్ల కారణంగా అధిక కొలెస్ట్రాల్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు చాలా రోజుల తర్వాత కానీ తెలియదు. కానీ కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరిగినట్లు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ ఉంటే కనిపించే లక్షణాల్లో శరీరం రంగు మారడం ఒకటి. దీనివల్ల శరీరం క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే కళ్ల చుట్టూ చిన్న చిన్న మొటిమలు అవుతుంటాయి. ఇలాంటి లక్షనాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* మొహంపై తరుచుగా దురదగా అనిపించినా చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం కారణమని భావించాలి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. ఇక దురదతో పాటు మొహం ఎర్రగా మారినా అధిక కొలెస్ట్రాల్‌ లక్షణమే.

ఇవి కూడా చదవండి

* శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే మొహంపై చిన్న చిన్న మొటిమలు కనిపిస్తుంటాయి. అలాగే కళ్లు, ముక్కు చుట్టూ ఎర్ర రంగులో చిన్న చిన్న మొటిమలు వస్తుండడం గమనించవచ్చు.

* శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరిగిన వారిలో మొహంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. సహజంగా ఇవి చెమట వల్ల వచ్చే ర్యాషెస్‌ అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ ర్యాషస్‌ ఇతర కారణాలతో వచ్చినా, వీటికి అధిక కొలెస్ట్రాల్‌ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా వైద్యుల సూచన మేరకే తీసుకోవడం ఉత్తమమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో