Health: హార్ట్ ఎటాక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి..

Health: అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ.. వచ్చిందంటే ప్రాణాల మీదికే వస్తుంది. అదే హార్ట్‌ ఎటాక్‌. ఇటీవలి కాలంలో హార్ట్‌ ఎటాక్‌...

Health: హార్ట్ ఎటాక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి..
Heart Attack
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 5:53 PM

Health: అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ.. వచ్చిందంటే ప్రాణాల మీదికే వస్తుంది. అదే హార్ట్‌ ఎటాక్‌. ఇటీవలి కాలంలో హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తక్కువ వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గుండె పోటు అనుకోకుండా వచ్చినా.. దానికి తాలుకూ లక్షణాలు మాత్రం ముందు నుంచే మనకు హెచ్చరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ గుండె పోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..

* ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో ఎడతెరపి లేకుండా నొప్పిగా ఉన్నా, ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం గుండె పోటుకు సూచనగా భావించాలి. ఒకటి రెండు రోజులకు మించి ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఇక కొందరిలో గుండె పోటు వచ్చే ముందు దవడ, మెడ, జీర్ణాశంయపై భాగంలో కూడా నొప్పిగా ఉంటుంది. ఇలాంటి లక్షణం కనిపించినా వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

* గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో తీవ్రమైన అలసట ఒకటి. చిన్న పనులకే నీరసంగా ఉన్నా, కొద్దిగా నడిచినా ఆయసం వస్తున్నా గుండె సంబంధిత వ్యాధులకు సూచనగా భావించాలి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఛాతి పట్టేసినట్లు ఉన్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఆసిడిటిగా భావించి చాలా మంది లైట్‌ తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం.

పైన తెలిపిన లక్షణాలు ఏవీ కనిపించినా అశ్రద్ధగా ఉండొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా వెంటనే నయం చేయవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలను చేయించుకోవడం ఉత్తమం.

Also Read: Olivia Morris: కుర్రోళ్ళ కొత్త క్రష్.. ఒలివియా మోరిస్ లేటెస్ట్ ఫొటోస్

David Warner: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మీరే రావాలి.. క్రికెట్‌ ఫ్యాన్‌ కోరికకు వార్నర్‌ ఏం సమాధానం చెప్పాడంటే..

South India: దక్షిణ భారతదేశంలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఈ ప్రదేశాలు చాలా ఫేమస్‌..

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి