David Warner: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మీరే రావాలి.. క్రికెట్‌ ఫ్యాన్‌ కోరికకు వార్నర్‌ ఏం సమాధానం చెప్పాడంటే..

డేవిడ్ వార్నర్.. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒక్కడు. అతను ఒంటి చేత్తో మ్యాచ్‎లు గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆటగాడిగానే కాదు నాయకుడిగా ఐపీఎల్‌ సన్ రైజర్స్ హైదరాబాద్‎కు టైటిల్‎ను కూడా అందించాడు..

David Warner: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మీరే రావాలి.. క్రికెట్‌ ఫ్యాన్‌ కోరికకు వార్నర్‌ ఏం సమాధానం చెప్పాడంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2021 | 8:05 PM

డేవిడ్ వార్నర్.. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒక్కడు. అతను ఒంటి చేత్తో మ్యాచ్‎లు గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆటగాడిగానే కాదు నాయకుడిగా ఐపీఎల్‌ సన్ రైజర్స్ హైదరాబాద్‎కు టైటిల్‎ను కూడా అందించాడు. కానీ 2021 ఐపీఎల్‎లో సరిగా ఆడకపోవటంతో అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అతనిని కెప్టెన్సీ నుంచి ఆ తర్వాత తుది జట్టు నుంచి తొలగించింది. అయితే ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే ప్రారంభమైన టీ 20 వరల్డ్ కప్‎లో అద్భతంగా రాణించాడు వార్నర్. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తన ఆటతీరు గురించి విమర్శించిన వారికి సరైన సమాధానం చెప్పినట్లయింది.

కాగా 2016 సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ టైటిల్‌ అందించిన డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ 2021 రెండో దశలో కేవలం రెండు మ్యాచ్‎ల్లో మాత్రమే ఆడాడు. త్వరలోనే మళ్లీ ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఈక్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం వార్నర్‌ను రీటెయిన్‌ చేసుకోవాలని అతని అభిమానులు కోరుతున్నారు. అంతేకాదు తనను మళ్లీ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నామని క్రికెట్‌ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అయితే తనను జట్టు నుంచి తొలగించడంపై మనస్థాపం చెందిన వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను మళ్లీ జట్టుతో కలవకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘WeAreOrangeArmy’ అనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్‌ పేజీలో ఒక అభిమాని హెడ్‌ కోచ్‌ గాటామ్ మూడీ, కెప్టెన్‌గా వార్నర్‌ గా రావాలని కోరుకుంటున్నామని కామెంట్‌ పెట్టాడు. దీనికి స్పందించిన వార్నర్‌ ‘ నో థ్యాంక్స్‌’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌తో అతని ప్రయాణం ముగిసినట్టేనని అర్థమవుతోంది. కాగా ఐపీఎల్‌-2022కు సంబంధించి త్వరలోనే వేలం జరగనుంది.

Also Read:

లైవ్‌ మ్యాచ్‌లో ప్రేయసి కోసం !! వెతికిన టీమిండియా బౌలర్‌ !! వీడియో

సిరాజ్‎ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‎గా మారిన వీడియో

వీడు మామూలోడు కాదు.. 11 బంతుల్లో సినిమా చూపించాడు.. ఏ బౌలర్‌ను విడిచిపెట్టలేదు.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్!