Tamarind Benefits: చింతపండుతో డయాబెటిక్‏కు చెక్.. రక్తపోటును నియంత్రించే సంజీవని.. ప్రయోజనాలు తెలిస్తే వదలడం కష్టమే..

Tamarind Benefits: సాధారణంగా చింతపండును భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సాంబార్ దగ్గర్నుంచి

Tamarind Benefits: చింతపండుతో డయాబెటిక్‏కు చెక్.. రక్తపోటును నియంత్రించే సంజీవని.. ప్రయోజనాలు తెలిస్తే వదలడం కష్టమే..
Tamaring
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 26, 2021 | 8:17 PM

Tamarind Benefits: సాధారణంగా చింతపండును భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సాంబార్ దగ్గర్నుంచి పులిహోర చేయడం వలన చింతపండును ఉపయోగించకుండ ఉండరు. ఇవే కాదు.. చింతపండు పచ్చడిని కూడా వాడేస్తుటారు. కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి బోలేడన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా.. కాల్షియం, విటమిన్ సీ, ఇ, బీ, ఐరన్, భాస్వరం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ అధికంగా ఉంటాయి. చింతపండును తినడం వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా అధికంగానే ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

1. డయాబెటిక్ రోగులకు చింతపండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చింతపండు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అలాగే శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తుంది. 2. చింతపండులో ఉండే హైడ్రోసిట్రిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అయ్యే కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అతిగా తినే అలవాటును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. 3. చింతపండులో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును నియంత్రించడంతోపాటు ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. 4. చింతపండులో ఆక్సీకరణ నష్టం, వ్యాధి నుండి గుండెను రక్షించే భాగాలు ఉన్నాయి. 5. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని 600 పనులను నెరవేర్చడంలో సహాయపడుతుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రించబడుతుంది. అలాగే వాపు మొదలైన సమస్యలు నయమవుతాయి. అవి మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

Also Read: Telangana Corona: తెలంగాణాలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..

Viral Video: ఇదేందిది! రాబిన్‌హుడ్‌ను మించిపోయిన చిలుక.. ఏం చేసిందో చూస్తే షాకవుతారు..

Chhattisgarh HC: కట్టుకున్న భార్యను భర్త అలా చేస్తే తప్పేం కాదు.. ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు సంచలన తీర్పు..