Covishield Dose Gap: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధి తగ్గించే యోచనలో కేంద్రం..
Covishield Dose Gap: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Covishield Dose Gap: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ధృవీకరించిన సీనియర్ ప్రభుత్వ అధికారులు.. దీనిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(NTAGI) తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. 45 ఏళ్లకు పైబడిన వయస్కులకు మాత్రమే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించే యోచనలో ఉన్నట్లు NTAGI చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా ఇటీవల తెలిపారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పుడు కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ల మధ్య కాల వ్యవధి 4 నుంచి 6 వారాలుగా ఉండేది. ఆ తర్వాత దీన్ని 4-8 వారాలకు పెంచారు. చివరగా రెండు డోసుల మధ్య కాలవ్యవధిని 12-16 వారాలకు పెంచారు. వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు అశాస్త్రీయంగా కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య కాలవ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచిందని అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ విమర్శలను తోసిపుచ్చిన కేంద్రం..శాస్త్రీయ పరిశోధనల అనంతరం వైద్య నిపుణుల బృందం సూచన మేరకే ఈ కాల వ్యవధిని పెంచినట్లు తెలిపింది. తొలి డోసు వ్యాక్సిన్ ద్వారా యాంటి బాడీలు ఎక్కువగా ఉత్పత్తికావడంతో ఆ మేరకు రెండో డోస్ కాల వ్యవధిని పొడగించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read..
Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరంటే? ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Software Engineer Suicide: పెళ్ళికావడం లేదని మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..