Chhattisgarh HC: కట్టుకున్న భార్యను భర్త అలా చేస్తే తప్పేం కాదు.. ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు సంచలన తీర్పు..
Chhattisgarh HC: వైవాహిక అత్యాచాంపై ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వైవాహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని నిర్ధోషిగా ప్రకటించింది. అంతేకాదు..
Chhattisgarh HC: వైవాహిక అత్యాచాంపై ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వైవాహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని నిర్ధోషిగా ప్రకటించింది. అంతేకాదు.. వివాహితులైన స్త్రీ, పురుషుల మధ్య లైంగిక చర్య బలవంతంగా, భార్య కోరికలకు విరుద్ధంగా జరిగినప్పటికీ అది అత్యాచారం కాదని పేర్కొంది. ‘‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఒక వ్యక్తి తన భార్యకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగానైనా జరిపిన లైంగిక సంపర్కం అత్యాచారం కాదు. దానిని హత్యాచార నేరం కింద పరిగణించబడదు.’’ అని ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాగా, తనకు ఇష్టం లేకున్నా తన భర్త తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేసింది. చట్ట ప్రకారం భర్త అయినందున అతను చేసిన పనిని చట్టవిరుద్ధమైనదిగా భావించలేమని స్పష్టం చేసింది.
కాగా, బాధిత మహిళకు సదరు వ్యక్తితో గతేడాది నవంబర్ 22న వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త కుటుంబ సభ్యులు తనపై ఆంక్షలు పెట్టడం ప్రారంభించారని, నిత్యం తనను దూషిస్తూ.. అధిక కట్నం డిమాండ్ చేశారని సదరు మహిళ తన పిటిషన్‌లో ఆరోపించింది. అంతేకాదు.. వివాహమైన నెల రోజుల తరువాత తన ఇష్టానికి విరుద్ధంగా తన భర్త తనతో లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దంపతులిద్దరూ జనవరి 2వ తేదీన ముంబై సమీపంలోని మహాబలేశ్వర్ అనే హిల్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భర్త తన భార్య కోరికకు విరుద్ధంగా మళ్లీ లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ ఘటన తరువాత తాను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానని, నడుము కింది భాగంలో పక్షవాతం మాదిరిగా వచ్చిందని వైద్యులు తెలిపినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటన తరువాత సదరు మహిళ తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ముంబైలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
Also read:
Batch Trailer: యంగ్ హీరో ఆకాష్ పూరీ చేతుల మీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..
డాక్టర్ల సూచనకై ఇలాంటి సమయాల్లో అరటిపండుకు తినకుండా ఉండటమే మంచిది.. :Banana Not Be Eaten.
Big News Big Debate: పొలిటికల్ సవాళ్లు.. మేడ్చల్ యుద్ధం సవాళ్ల రాజకీయం ఛాలెంజ్..!(లైవ్ వీడియో).