Software Engineer Suicide: పెళ్ళికావడం లేదని మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
Software Engineer Suicide: జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు.. ఒకటి కాలం.. రెండోది ప్రాణం.. అయితే క్షణికావేశం తీసుకునే నిర్ణయాలు అనర్థాలను కలిగిస్తాయి. జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని సార్లు ఆత్మహత్యకు చేసుకునే..
Software Engineer Suicide: జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు.. ఒకటి కాలం.. రెండోది ప్రాణం.. అయితే క్షణికావేశం తీసుకునే నిర్ణయాలు అనర్థాలను కలిగిస్తాయి. జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని సార్లు ఆత్మహత్యకు చేసుకునే విధంగా ఆ ఆలోచనలు పురిగొపుతాయి. దీంతో అప్పటి వరకూ జీవించాలని ఉన్నా మనిషి మనసుని మార్చేస్థాయి ఆ ఆలోచనలు. ఆ సాయంలో మనపై ఆధారపడినవారిని గుర్తు చేయవు.. కనిపెంచిన తల్లిదండ్రులు, అన్ని సమయాల్లో అండగా నిలిచిన స్నేహితులు గుర్తుకు రారు.. క్షణికావేశంలో మనిషి తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. చంపడమో.. చావడమో తప్ప సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఆలాంటి విషాద ఘటన ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కామారెడ్డి జిల్లాలోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల రాజ్ కుమార్ (28) ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. ముంబైలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో రాజ్ కుమార్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తనకు పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది రాజ్ఆ కుమార్త్మ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.