Tomato Soup: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ టమాటా సూప్ తయారీ.. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
Tomato Soup Recipe: వేసవిలో దాహార్తి తీర్చుకోవడానికి ఎలా కూల్ డ్రింక్స్, మజ్జిగ, చెరకు రసం వంటి వాటిని తాగడానికి ఇష్టపడతామో.. అలాగే వర్షాకాలం వేడి వేడిగా బజ్జిలు, సుప్ లు కావాలనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో..
Tomato Soup Recipe: వేసవిలో దాహార్తి తీర్చుకోవడానికి ఎలా కూల్ డ్రింక్స్, మజ్జిగ, చెరకు రసం వంటి వాటిని తాగడానికి ఇష్టపడతామో.. అలాగే వర్షాకాలం వేడి వేడిగా బజ్జిలు, సుప్ లు కావాలనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల నుంచి కాపాడడానికి రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు టమాటా సూప్‌ను తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ టమాటా సూప్ తో . అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ టమాటా సూప్ తయారు చేయడం ఎలా చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
టమాటాలు- 8 మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం- ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్ నీళ్లు – 4 కప్పులు ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం:
ముందుగా ప్రెష్ గా ఉన్న టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీలో నాలుగు కప్పుల నీటిని కలిపి స్టవ్ మీద పెట్టాలి. అది బాగా మారుతున్న సమయంలో మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం స్విమ్ లో పెట్టి.. మరికొంచెం సేపు మరిగించాలి. తర్వాత స్టౌ మీద నుంచి దింపి.. దానిలో పుదీనా వేసుకుని వేడివేడిగా బ్రేక్ ఫస్ట్ తో పాటు ఒక కప్ టమాటా సూప్ సేవిస్తే.. మంచిది.
ఆరోగ్య ప్రయోజనాలు:
*టమాటాల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపిస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులును రాకుండా మనల్ని రక్షిస్తాయి. అందుకని టమాటాని నేరుగా తాగలేని వారు సూప్ గా తయారు చేసుకుని తాగడం మంచిది. *టమాటా సూప్‌లో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం, కెరోటినాయిడ్స్, లైకోపీన్ వంటి పోషకాలు ఉన్నాయి ఇవి వ్యాధుల బారిన పడకుండా చూస్తాయి చర్మానికి మంచి పోషణను ఇస్తాయి. *టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. *రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ టమాటా సూప్ మంచి పాత్రను పోషిస్తుంది. రోజూ కప్పు మోతాదులో టమాటా సూప్‌ను తాగితే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు
Also Read: ఒక అమ్మాయి ఈ సంకేతాలు ఇస్తే అబ్బాయి స్నేహాన్ని, ప్రేమని ఇష్టపడుతుందని అర్ధమట