- Telugu News Lifestyle Food These Foods are enemy of your liver they can cause of fatty liver problem
ఇవి తింటే కాలేయం పని ఖతమే.. ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీసే ఆహారాలేంటో తెలుసా?
కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దాని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. కాలేయానికి చాలా హానికరంగా భావించే కొన్ని ఆహారాలను తెలుసుకుందాం.
Updated on: Aug 26, 2021 | 3:50 PM

మీరు స్వీట్లు తినడానికి ఇష్టపడుతున్నారా? అయితే, మీరు ఈ అలవాటును త్వరగా తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల కాలేయానికి చాలా హానికరం. చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలతో పాటు చక్కెర ఎక్కువగా ఉండే అన్ని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ శాతం అధికంగా పెరుగుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.

మీరు సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, స్ప్రింగ్ రోల్స్ మొదలైనవి ఇష్టంగా తింటుంటారా? మీ ఈ అలవాటు కూడా కాలేయానికి హాని కలిగించవచ్చు. ఎందుకంటే వేయించిన వస్తువులలో సంతృప్త కొవ్వుల శాతం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, ఇతర సమస్యలను కూడా పెంచేందుకు దోహదం చేస్తాయి.

ఉప్పులో సోడియం ఉన్నందున ఎక్కువగా తినకూడదు. దీని వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు నీరు నిల్వ ఉంటుంది. ఇది కాలేయ వాపుకు దారితీస్తుంది. కాలేయం చుట్టూ కొవ్వు లేదా ఇతర కాలేయ సమస్యలకు దారితీస్తుంది. ఈ కారణంగా ఫ్యాటీ లివర్ రోగులు తక్కువ ఉప్పును తీసుకోవాలని నిపుణులు చూసిస్తున్నారు.

మీరు బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు మొదలైన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటున్నా సరే.. అవి మీ కాలేయానికి చాలా హానికరంగా తయారవుతాయి. ఈ ఆహార పదార్థాలు కాలేయంలో కొవ్వును పెంచడానికి దోహదపడతాయి. అలాగే ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచడానికి పని చేస్తాయి.

ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయానికి హానికరం. మద్యం తాగడం వల్ల కాలేయ కణాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో కాలేయ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది.




