Tapeworm: చిన్నారులు కడుపునొప్పి, రక్తహీనతతో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..

Tapeworm Infection: నులి పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ నులిపురుగులున్నవారు శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు..

Tapeworm: చిన్నారులు కడుపునొప్పి, రక్తహీనతతో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..
Tapeworm Infection
Follow us

|

Updated on: Aug 26, 2021 | 3:30 PM

Tapeworm Infection: నులి పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ నులిపురుగులున్నవారు శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా 1-19 ఏళ్లలోపు చిన్నారులు, బాలబాలికల ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తినే సమయంలో చేతులు పరిశుభ్రత పాటించకపోతే రకరకాల నులిపురుగులు లార్వాలు నోటి ద్వారా కడుపులోకి చేరతాయి. తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి వివిధ రోగాలబారిన పడుతారు. అందుకనే నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తుంది.

మూడు రకాల నులి పురుగులు:

పిల్లల పేగుల్లో సాధారణంగా ఏలిక పాములు, కొంకి పురుగులు, చుట్ట పాములు అనే మూడు రకాల పురుగులు ఉంటాయి. ఈ నులిపురుగులు 55 అడుగులు పెరిగి 25 ఏళ్ల వరకూ కడుపులో జీవిస్తాయి. ఇవి పెట్టె గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. ముఖ్యంగా నులిపురుగులు సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసం ద్వారా చుట్టపాములు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. నులి పురుగులు ఉన్న బాలబాలికలు ఆరుబయట మలవిసర్జన చేస్తే.. అవి ఇతరుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మల పరీక్ష ద్వారా నులి పురుగులను గుర్తించవచ్చు.

నులిపురుగులు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు:

*అపరిశుభ్రతతో, ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. *కలుషిత ఆహారము ,ఈగలు వాలిన తినుబండారాలు దుమ్ము , ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా .. కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వ్యాప్తి చెందుతాయి. *ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. *ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండుట వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోని నులిపురుగులు వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వలన వ్యాప్తి చెందుతాయి. *చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి *కూరగాయాలను శుభ్రమైన నీటితో కడగాలి. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడు మూతలు కప్పి ఉంచాలి.

నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు:

నులిపురుగులను నివారించడానికి తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్‌ వంటి ఆహారపదార్ధాలు ఉపయోగపడతాయి. ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోవాలి. పుదీనా రసం పరగడుపున తీసుకుంటే.. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి మలం ద్వారా బయటపడతాయి. ఎంజైమ్‌లు వృద్ది చెందాలంటే విటమిన్‌-సీ, జింక్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కలుషితమైన నీటిని తాగకూడదు.

2015 నుండి ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నిర్మూల‌నా దినోత్స‌వం (ఎన్‌డిడి) నిర్వ‌హిస్తున్నారు. దీనిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ అమ‌లు చేస్తోంది. ప్రతి సంవ‌త్స‌రం రెండుసార్లు ఫిబ్రవరి 10, ఆగస్టు 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పాఠ‌శాల్లో, అంగ‌న్‌వాడీల్లో ఒక రోజుకార్య‌క్ర‌మంగా నిర్వ‌హిస్తున్నారు.

Also Read: Dalit Bandhu Scheme: దళితబంధు పథకంకోసం మరో రూ. 500 కోట్లు విడుదల.. పైలట్ ప్రాజెక్టుకు ఏర్పాట్లు పూర్తి