Dalit Bandhu Scheme: దళితబంధు పథకంకోసం మరో రూ. 500 కోట్లు విడుదల.. పైలట్ ప్రాజెక్టుకు ఏర్పాట్లు పూర్తి
Dalit Bandhu Scheme: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దళిత బంధు పథకం మొదలు పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే దీని లక్ష్యం...
Dalit Bandhu Scheme: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దళిత బంధు పథకం మొదలు పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే దీని లక్ష్యం. మహిళల పేరుమీద ఈ నగదును ప్రభుత్వం జమ చేయనుంది. దళితబంధు పథకం అమలులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది.
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సీఎం కేసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం, నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సీఎం కేసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.
ఈ దళిత బంధు పథకం ప్రభుత్వ కొలువు ఉన్న కుటుంబానికి వర్తించదు. అంతేకాదు దళిత బంధును సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అర్హులైన వారు నమోదు చేసుకునేలా చూడటం వారు అనువైన వ్యాపారం ఎంచుకోవడంలో సహకరిండం ఈ కమిటీల బాధ్యత.
Also Read: AP Crime News: స్కూల్ లో పిల్లలతో పనిచేయించడం ఉపాధ్యాయులదే తప్పు.. మృతికి కారణమైనవారిపై…