యూపీలో భారీ వర్షాలు..బాగ్ పట్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న కారు..డ్రైవర్ ఏం చేశాడంటే ..?

ఢిల్లీ, యూపీ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల ఇక్కట్లు ఇన్నీఅన్నీ కావు. యూపీలోని బాగ్ పట్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

యూపీలో భారీ వర్షాలు..బాగ్ పట్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న కారు..డ్రైవర్ ఏం చేశాడంటే ..?
Car Gets Stuck In Flooded Underpass In Up At Baghpat
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 2:08 PM

ఢిల్లీ, యూపీ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల ఇక్కట్లు ఇన్నీఅన్నీ కావు. యూపీలోని బాగ్ పట్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైల్వే అండర్ పాస్ ప్రాంతమంతా వర్షపు నీటితో నిండిపోయింది. ఈ మార్గం గుండా వస్తున్న ఫార్చ్యూనర్ కారు నీటిలో చిక్కుకుపోయి ఇక కదలనంటూ మొరాయించింది. క్రమంగా కారులోకి కూడా నీరు చేరుతుండడంతో డ్రైవర్ చేసేది లేక కారు టాప్ పైకి ఎక్కేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. రమాలా పోలీసు స్టేషన్ పరిధిలోని జీవన గ్రామంలో జరిగిన ఈ ఉదంతం.. ఇలా వీడియోకెక్కింది. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో వర్షపు నీరంతా ఇక్కడే ఉండిపోతోందని, అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోయారు.

మొత్తానికి నీరు కాస్త నెమ్మదించడంతో వారు ఆ కారు డ్రైవర్ ని రక్షించి..కారుకు తాడు కట్టి లాగి బయటికి తెచ్చారు. మరో రెండు రోజులు ఈ రాష్ట్రానికి వర్షాల బెడద తప్పదని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.

మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.