What Do Girls Like In Boys: ఒక అమ్మాయి ఈ సంకేతాలు ఇస్తే అబ్బాయి స్నేహాన్ని, ప్రేమని ఇష్టపడుతుందని అర్ధమట

What Do Girls Like In Boys: ప్రేమ, స్నేహం మనిషి జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తాయి. యూత్ కి ప్రేమించడం .. అమ్మాయిలకు ప్రపోజ్ చేయడం.. సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఒక అమ్మాయి తమ ప్రేమని కాదంటే..

What Do Girls Like In Boys: ఒక అమ్మాయి ఈ సంకేతాలు ఇస్తే అబ్బాయి స్నేహాన్ని, ప్రేమని ఇష్టపడుతుందని అర్ధమట
Girl Like Boy
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2021 | 4:46 PM

What Do Girls Like In Boys: ప్రేమ, స్నేహం మనిషి జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తాయి. యూత్ కి ప్రేమించడం .. అమ్మాయిలకు ప్రపోజ్ చేయడం.. సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఒక అమ్మాయి తమ ప్రేమని కాదంటే.. చాలామందిలో తనకు ఏమి తక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. కొంతమంది డిప్రషన్ లోకి కూడా వెళ్లారు.. మరికొందరు తనను ఇంకే అమ్మాయి ఇష్టపడదు అని కూడా అనుకుంటారు.. అయితే మీరు ప్రేమించాలనుకున్న అమ్మాయి.. మీకు మీ నేచర్ కు సరిపోతుందా మీ స్నేహంగా ఉండగలదా అని ముందుగా ఆ అమ్మయి గురించి తెలుసుకుంటే.. మంచింది. అప్పుడు ఆ సదరు అమ్మాయిమీ ఆశలు పెంచుకోకుండా ఆదిలోనే తుంచుకుని హ్యాపీగా మరొకఅమ్మాయిని ఎంచుకోవచ్చు.. లేదంటే బుద్దిగా అమ్మానాన్నా చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం ప్రేమించవచ్చు. అందుకనే ఒక అమ్మాయి మీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతుందని తెలిపేందుకు సంకేతాలు ఉంటాయట అవి ఏమిటో చూద్దాం..

కళ్ళు మాట్లాడతాయి

ఒక అమ్మాయి అబ్బాయి స్నేహం కోరుకుంటుందని ఆమె కళ్ళు ద్వారా తెలుస్తుందట.. ఎక్కువగా అమ్మాయిలు ఇష్టం లేని వారు మాట్లాడితే.. వారివైపు కన్నెత్తి కూడా చూడరు. అలా కాకుండా మీతో మాట్లాడుతుంటే.. మీ స్నేహం అంటే ఆసక్తి ఉన్నట్లు లెక్క అని అంటున్నారు.

అలంకరణ:

తమకి ఇష్టమైనవారిని కలుసుకోవాలని అనుకున్న అమ్మాయి.. మంచి అందంగా రెడీ అవుతుందట. కట్టు, బొట్టు నుంచి నిలబడే తీరు అంతా స్పెషల్ గా అనిపిస్తుంది..

ఏదో వంకతో మాట్లాడానికి చూస్తారు:

అమ్మాయికి ఏదైనా సందేహం వస్తే.. ఎంత దూరంలో ఉన్నా మిమ్మల్ని అడగడానికి ఆసక్తి చూపిస్తారు.

స్నేహంగా మెలుగుతారు:

సర్వసాధారణంగా తెలియని అబ్బాయిల పక్కన అమ్మాయిలు కూర్చోవడానికి ఇబ్బంది పడతారు.. అయితే తమకు నచ్చి.. మెచ్చిన అబ్బాయి పక్కన కూర్చున్నా ఇబ్బంది పడరు. అబ్బాయిని ప్రేమిస్తే.. క్లోజ్ గా మూవీ అవుతారు కూడా.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 షోకి రంగం సిద్ధం.. నేటి నుంచి క్వారంటైన్‌లో సభ్యులు.. అలరిస్తున్న ప్రోమో..

చిన్నారులు కడుపునొప్పి, రక్తహీనతతో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..