Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 షోకి రంగం సిద్ధం.. నేటి నుంచి క్వారంటైన్‌లో సభ్యులు.. అలరిస్తున్న ప్రోమో

Bigg Boss 5 Telugu: హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టిన షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ లోకి అడుగు పెడుతోంది. కరోనా నేపథ్యంలో ఈ షో కొంచెం లేట్..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 షోకి రంగం సిద్ధం.. నేటి నుంచి క్వారంటైన్‌లో సభ్యులు.. అలరిస్తున్న ప్రోమో
Bigg Boss 5
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2021 | 3:49 PM

Bigg Boss 5 Telugu: హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టిన షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ లోకి అడుగు పెడుతోంది. కరోనా నేపథ్యంలో ఈ షో కొంచెం లేట్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడింది. బీగ్ బాస్ – 5 సీజన్ ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది. ఇప్పటికే . నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ షో సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నదని ట్వీట్ చేసారు.

ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ఎక్కువమంది లేడీస్ కంటెస్టెంట్లు ఉండనున్నారట. షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 26 నుండి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సీజన్ 5 బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు పేర్లు అనేకమందివి వినిపిస్తున్నాయి. ఈసారి సీజన్ లో సందడి చేయడానికి యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి, యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క రఘు మాస్టర్, సురేఖావాణి, సిరి హనుమంత్, యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్ రాబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ వీరే సీజన్ 5 లో సందడి చేసే కంటెస్టెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

బిగ్ బాస్ -5 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 10గం.లకు ఈ షో ప్రసారం కానుండగా, శని,ఆదివారాలలో 9గం.లకు మొదలు కానుంది. దీంతో..బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు రెడీ అవుతుంది.

Also Read:  Tapeworm: చిన్నారులు కడుపునొప్పి, రక్తహీనతతో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల