Marburg virus: ప్రపంచానికి మరో వైరస్‌ ముప్పు.. మార్‌ బర్గ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం.

ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మరిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇలాంటి సమయంలో మరో వైరస్‌ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన..

Marburg virus: ప్రపంచానికి మరో వైరస్‌ ముప్పు.. మార్‌ బర్గ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం.
Marburg Virus
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 14, 2023 | 9:34 AM

ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మరిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇలాంటి సమయంలో మరో వైరస్‌ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన ‘మార్ బర్గ్’ వైరస్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్‌ అయ్యింది. తాజాగా ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా డబ్ల్యూహెచ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

మధ్య ఆఫ్రికాలో ఎబోలా లాంటి వైరస్ వ్యాప్తి గురించి చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. BNOలోని ఒక నివేదిక ప్రకారం, ఎబోలా లాంటి వైరస్ ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్‌ కారణంగా తొమ్మిది మంది మరణించారు. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సైతం విధించారు.

ఇదిలా ఉంటే ఈ వైరస్‌ ప్రాణాంతకమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ కు చాలా వేగంగా విస్తరించే సామర్థ్యం ఉందని తెలిపింది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు. వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగుల పడక, వస్త్రాలను ఇతరులు వినియోగించడం ద్వారా మార్ బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు..

ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రంగా జ్వరం, తలనొప్పి ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా, బయటికి రక్త స్రావం జరుగుతుంది. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయి. చికిత్స చేయడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..