Jaggery Benefits: బెల్లంతో అద్భుతమైన ఉపయోగాలు.. ఈ సమస్యలు పరిష్కారం
బెల్లం.. దీనిని దాదాపు అందరూ ఇష్టపడుతుంటారు. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన మోతాదులో ఐరన్‌ను అందిస్తుంది..

Jaggery
బెల్లం.. దీనిని దాదాపు అందరూ ఇష్టపడుతుంటారు. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన మోతాదులో ఐరన్‌ను అందిస్తుంది. అయితే ఇప్పుడు బెల్లం స్థానంలో అందరూ చక్కెరను వినియోగిస్తున్నారు. నిజానికి బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
- రక్తం శుద్ది: బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే శరీరంలోని విషపూరితమైన పదార్ధాలను తొలగిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తింటే జలుబు, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
- బరువు తగ్గడం: చక్కెరతో పోలిస్తే బెల్లంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని చూస్తున్నవారికి ఇది గొప్ప ఔషధం. అలాగే బెల్లం వల్ల ఉబ్బరం వంటి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. రోజూ బెల్లం తినడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
- ఎముకల దృఢత్వం: కాల్షియం, భాస్వరం బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఎముకలను గట్టి పరుస్తాయి. బెల్లంతో పాటు అల్లం కూడా ప్రతీరోజూ సేవిస్తే, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
- అజీర్ణం సమస్యలు దూరం: భోజనం చేసిన అనంతరం కొద్దిగా బెల్లం తింటే, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బెల్లం విటమిన్, ఖనిజ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటమే కాకుండా, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫైబర్, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్న బెల్లం రోజూ తింటే.. మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వాంతులు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
- రక్తహీనత సమస్యకు: ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే బెల్లం తినాలి. అంతేకాకుండా రక్తహీనతను నివారించేందుకు బెల్లం ఎంతగానో ఉపయొగపడుతుంది. బెల్లం శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి.. రక్తహీనత వంటి సమస్యలను నివారిస్తుంది.
ఇవి కూడా చదవండి

Skin Care Tips: వెనువెంటనే ఈ చెడు అలవాట్లను మానుకోకపోతే.. 40 ఏళ్లకే ముఖంలో వృద్ధాప్య లక్షణాలు ఖాయం..

Camphor Benefits: రూ.2 కర్పూరంతో ఎన్ని జబ్బులను నయం చేయవచ్చో..! తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

Okra Health Benefits : బెండకాయను మీ డైట్లో చేర్చుకుంటే డయాబెటిస్, కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు..!!

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో ప్రాణాంతక వ్యాధులు.. పరిశోధకుల షాకింగ్ నివేదికలు!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)