AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: వెనువెంటనే ఈ చెడు అలవాట్లను మానుకోకపోతే.. 40 ఏళ్లకే ముఖంలో వృద్ధాప్య లక్షణాలు ఖాయం..

సాధారణంగా ముఖంపై వృద్ధాప్య లక్షణాలనేవి నిర్ణీత వయస్సు దాటాక వస్తుంటాయి. కానీ పైన పేర్కొన్న ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు..

Skin Care Tips: వెనువెంటనే ఈ చెడు అలవాట్లను మానుకోకపోతే.. 40 ఏళ్లకే ముఖంలో వృద్ధాప్య లక్షణాలు ఖాయం..
Bad Habits That Causes For Aging
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 13, 2023 | 9:44 PM

Share

ప్రస్తుత కాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. మనం అలవరచుకున్న  జీవనశైలి,ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని తప్పక చెప్పుకోవాలి. ఈ కారణాల వల్లనే కొందరు చాలా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలతో బాధపడుతున్నారు. సాధారణంగా ముఖంపై వృద్ధాప్య లక్షణాలనేవి నిర్ణీత వయస్సు దాటాక వస్తుంటాయి. కానీ పైన పేర్కొన్న ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్ల కారణంగా శరీరానికి కావలసిన పోషకాలు, శక్తి సరైన సమయంలో లభించడంలేదు. అలాగే జీవనశైలి కారణంగా ఏ సమయానికి ఏ పని చేయాలో తెలియక లేేనిపోని సమస్యలకు కొని తెచ్చుకున్నట్లవుతోంది. మరి ఈ క్రమంలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రావడానికి గల కారణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి: ప్రస్తుత కాలంలోని ఉరుకులు పరుగుల జీవితం కారణంగా మనపై ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది. దాదాపు ప్రతి ఒక్కరూ ఈ ఒత్తిడి లోనవుతున్నారు. ఒత్తిడి పరిమితి దాటితే దుష్పరిణామాలు ఎదురవుతాయి. అతిగా ఆలోచించడం, ఎక్కువగా టెన్షన్ పడటం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని ప్రభావం ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది. అందుకే ఒత్తిడిని దూరం చేయడం చాలా అవసరం.

తగినంత నిద్ర: ఇటీవలి బిజీ లైఫ్‌స్టైల్‌లో పని ఒత్తిడి పెరిగి.. తగినంత నిద్ర ఉండటం లేదు. రోజుకు కావల్సిన ఆరోగ్యకరమైన 7, 8 గంటల రాత్రి నిద్ర దూరమైపోతోంది. ఫలతంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిద్ర సరిగ్గా లేకపోవడంతో ముఖంపై ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయల్లో ముఖ్యమైనవి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన ఆహారం: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వేళ కాని వేళల్లో తినడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎక్కువైంది. డైట్ సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. చర్మానికి హాని కలుగుతోంది. ఆయిల్, ఫ్రైడ్ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏజియింగ్ సమస్య ఎదురౌతోంది. హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

స్మోకింగ్: నికోటిన్ అనేది చర్మంలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. నికోటిన్ కారణంగా చర్మానికి తగిన పోషకాలు, ఆక్సిజన్ అందదు. ఫలితంగా మీ అందంపై దుష్ప్రభావం పడుతుంది.

కాబట్టి వెనువెంటనే ఈ చెడు అలవాట్లను విడిచిపెట్టాలని.. లేకపోతే వృద్ధాప్య లక్షణాలతో బాధపడక తప్పదని ఆరోగ్య, చర్మ సంబంధిత నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..