AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse 2023: తొలి సూర్యగ్రహణం ఈ రాశులకు వరం.. ఇందులో మీరూ ఉన్నారేమో ఓ సారి చూద్దాం రండి..

2023లో ఏర్పడనున్న 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాల ప్రభావం కూడా రాశిచక్రంలోని 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. ఈ గ్రహణాలు కొన్ని రాశులకు అత్యంత శుభకరమైతే.. మరికొన్ని

Solar Eclipse 2023: తొలి సూర్యగ్రహణం ఈ రాశులకు వరం.. ఇందులో మీరూ ఉన్నారేమో ఓ సారి చూద్దాం రండి..
Solar Eclipse 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 13, 2023 | 9:20 PM

Share

Sun Eclipse 2023: ప్రతి సంవత్సరం ఏర్పడే గ్రహణాల ప్రభావం రాశి చక్రంలోని 12 రాశుల జాతకచక్రాలపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అంటే 2023లో ఏర్పడనున్న 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాల ప్రభావం కూడా రాశిచక్రంలోని 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. ఈ గ్రహణాలు కొన్ని రాశులకు అత్యంత శుభకరమైతే.. మరికొన్ని రాశులకు తీవ్ర నష్టాలను, బాధలను చేకూర్చనున్నాయి. ఈ క్రమంలోనే 2023లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల జీవితంలో లాభాలు, ప్రయోజనాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయని అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఇక ఈ సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ఏర్పడి.. మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే..  ఈ గ్రహణం మన భారతదేశంలో కన్పించకపోయినా.. ఈ కింది రాశుల వారి జీవితంపై శుభప్రదంగా మారనుంది.

సూర్యగ్రహణం ఈ రాశుల వారికి శుభప్రదం: 

వృషభం: ఈ ఏడాది ఏప్రిల్ 20న ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్‌లో అపారమైన ప్రయోజనాలు పొందుతారు. మీకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. జీతంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వ్యాపారానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథునం: మిథునరాశివారిపై సూర్యగ్రహణం సానుకూల ప్రభావం చూపుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరి కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు: ఈ సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి కూడా ఎంతో అదృష్టమనే చెప్పాలి. మీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సూర్యగ్రహణ సమయం అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి మీ జాతకంలో ఈ సమయం సూపర్‌గా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు