- Telugu News Photo Gallery Weird valentine's Day traditions from around the world such as Japan Germany England Ghana
Valentine’s Day: అదృష్టమంటే అదే కదా.. ఆ దేశాలలో అమ్మాయిలే అబ్బాయిల వెనుక పడతారు.. ఇంకెన్నో వింత సాంప్రదాయాలెన్నో..
Valentines Day 2023: ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ ఫీల్ కనిపిస్తోంది. ఒక్కో చోట.. ఒక్కో రకమైన వాలెంటైన్స డే ట్రేడీషన్ ఉంటుంది. సాధారణంగా అమ్మాయిల వెంటే అబ్బాయిలు పడి.. వాళ్లకి ప్రపోజ్ చేయడానికి, చాక్లెట్లు ఇవ్వడానికి చాలా ప్లాన్స్ వేస్తారు. అయితే కొన్ని దేశాలలో మాత్రం అమ్మాయిలే అబ్బాయిల వెంట పడతారు. మరి అలాంటి సంప్రదాయాలు ఎక్కడున్నాయో ఓ సారి లుక్కేద్దామా..?
Updated on: Feb 13, 2023 | 7:56 PM

Valentines Day 2023: ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ ఫీల్ కనిపిస్తోంది. ఒక్కో చోట.. ఒక్కో రకమైన వాలెంటైన్స డే ట్రేడీషన్ ఉంటుంది. సాధారణంగా అమ్మాయిల వెంటే అబ్బాయిలు పడి.. వాళ్లకి ప్రపోజ్ చేయడానికి, చాక్లెట్లు ఇవ్వడానికి చాలా ప్లాన్స్ వేస్తారు. అయితే కొన్ని దేశాలలో మాత్రం అమ్మాయిలే అబ్బాయిల వెంట పడతారు.. వాళ్లకి చాక్లెట్లు ఇవ్వడానికి వెనక పడతారు. ఇలాంటి వింత వాలెంటైన్స్ డే సంప్రదాయాలు ఎక్కడున్నాయో ఓ సారి లుక్కేద్దామా..?

ఘనా: చాక్లెట్ అంటే చాలామందికి చాలా ఇష్టం ముఖ్యంగా పిల్లలకి.. అయితే ఆఫ్రికన్ దేశం ఘనా చాక్లెట్‌లకు ప్రపంచ ప్రసిద్ది. ఇక్కడ ఫిబ్రవరి 14న తమకు నచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలే చాక్లెట్ ఇవ్వడం సంప్రదాయం.. మరో విషయమేంటంటే ఫిబ్రవరి 14 ఘనాలో చాక్లెట్ డే కూడా జరుపుకుంటారు. ప్రేమికుల రోజు థీమ్ మెనులు, ప్రత్యేక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు కూడా ఉంటాయి. దేశంలో పర్యాటకాన్ని పెంచేందుకు 2007 నుండి అక్కడి ప్రభుత్వం ఈ వేడుక నిర్వహిస్తుంది.

డెన్మార్క్, నార్వే: ఈ రెండు దేశాల్లో వాలెంటైన్స్ డే రోజున తమకు నచ్చిన అమ్మాయిలకు అజ్ఞాత వ్యక్తిలాగా ఒక కవిత రాసి పంపుతారు అబ్బాయిలు. ఇక తమ పేరులోని అక్షరాలు వచ్చేలాగా డాట్ లైన్స్ కూడా పెడతారు. ఒకవేళ అమ్మాయి అతను ఎవరో కనిపెట్టగలిగితే ఆమెకు ఈస్టర్ గుడ్డు బహుమతిగా ఇస్తారు.

వేల్స్: వేల్స్‌లో ప్రేమికుల దినోత్సవాన్ని సెయిట్ వాలెంటైన్స్ డేగా జరుపుకోరు. దానికి బదులుగా సెయింట్ డ్విన్వెన్ డేని జరుపుకుంటారు. ఈ క్రమంలో లవర్స్ ఒకరికొకరు చేతితో తయారు చేసిన చెక్క స్పూన్లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సాంప్రదాయం 16వ శతాబ్దం నుంచి వస్తోంది.


ఫిలిప్పీన్స్: ఇక్కడ వాలెంటైన్స్ డే పెళ్లి్ల్ల రోజుగా మారిపోతుంది. ప్రేమికుల రోజున ఇక్కడ చాలా మంది పెళ్లిలు చేసుకుంటారు. మాస్ వెడ్డింగ్స్‌కు కేరాఫ్ ఫిలిప్పీన్స్. అలాగే వేలాది మంది ప్రేమికులు మనీలా బే తీరంలో ఆడి పాడతారు. అర్ధరాత్రి వేళ అందరూ ఒక్కసారిగా తమ ప్రియమైన వారిని కిస్ చేస్తారు.

చెక్ రిపబ్లిక్: ఈ దేశంలో చాలా మంది చెర్రీ పువ్వు చెట్టు కింద ముద్దు పెట్టుకునే రోజుగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం దంపతులకు ఆ ఏడాదంతా అదృష్టాన్ని తెస్తుందని చెబుతారు.

ఇంగ్లాండ్: అనేక శతాబ్దాల నుంచి వస్తున్ బ్రిటన్ సంప్రదాయం ప్రకారం, వాలెంటైన్స్ డేకు ముందు రోజు రాత్రి ఇంగ్లాండ్‌లోని మహిళలు తమ దిండు పక్కన బే ఆకులను పెట్టి నిద్రపోతారు. ఇలా చేస్తే తియ్యటి కలలు వస్తాయట. ఈ సంప్రదాయాన్ని పాటించే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు వారికి కాబోయే భర్త కనిపిస్తాడట.

జర్మనీ: జర్మనీలో వాలెంటైన్స్ డేన ప్రేమికులకు పందుల చిత్రాలు, విగ్రహాలు లేదా చాక్లెట్ నమూనాలను బహుమతిగా ఇస్తారు.

జపాన్: ఇక్కడ అమ్మాయిలే అబ్బాయిల వెంట పడతారు..! వేరే కారణంతో కాదు. చాక్లెట్లు ఇవ్వడానికి మాత్రమే. నిజానికి జపాన్‌లో విక్రయించే మొత్తం చాక్లెట్లలో సగం వాలెంటైన్స్ డేకు దగ్గరగా ఉన్న రోజుల్లోనే అమ్ముడుపోతాయట.





























