WPL Auction 2023: డబ్ల్యూపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టేసిన మహారాణులు.. పురుషుల కంటే తక్కువేం కాదంటూ..

‘మేమేం తక్కువకాదు..ఆకాశంలో సగమే..! పురుషులతో సమానమే..! ఛాన్స్‌ ఇస్తే సత్తా చాటేస్తాం..!’ అనేది కొద్దిరోజుల క్రితం ఉమెన్స్‌టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలిరాజ్‌..

WPL Auction 2023: డబ్ల్యూపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టేసిన మహారాణులు.. పురుషుల కంటే తక్కువేం కాదంటూ..
Wpl Auction 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 13, 2023 | 9:30 PM

‘మేమేం తక్కువకాదు..ఆకాశంలో సగమే..! పురుషులతో సమానమే..! ఛాన్స్‌ ఇస్తే సత్తా చాటేస్తాం..!’ అనేది కొద్దిరోజుల క్రితం ఉమెన్స్‌టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలిరాజ్‌ అన్నమాట. దేశానికి ఆడటమే కాదు..మహిళ క్రికెటర్లకు ఐపీఎల్‌ లాంటి అవకాశం ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ఇప్పుడా కళ నెరవేరింది. ఆ క్రమంలోనే రూపం దాల్చినదే వుమెన్స్ ప్రిమియర్ లీగ్(డబ్య్లూపీఎల్). ఇక ఆ లీగ్ కోసం నేడు(ఫిబ్రవరి 13) ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్‌ ప్రిమియర్‌లీగ్‌ వేలంలో మహిళ క్రికెటర్లు జాక్‌పాట్‌ కొట్టేసి మహారాణులు అయ్యారు. ముంబై జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఉమెన్స్‌ ప్రీమియర్‌లీగ్‌ వేలం పాట ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. ముంబై, యూపీ, బెంగళూరు, గుజరాత్‌, ఢిల్లీ ప్రాంఛైజీలు పాల్గొన్నాయి. 409 మందితో కూడిన క్రికెటర్ల జాబితాలో 90 మంది కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. ప్రధానంగా బ్యాటర్స్‌, బౌలర్స్‌, ఆలౌరౌండర్స్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటాపోటీగా వేలంపాట కొనసాగింది. దేశీయ ప్లేయర్లనే కాదు, విదేశీ మహిళ క్రికెటర్లను దక్కించుకోవడం కోసం యాక్షన్‌ కొనసాగింది.

అత్యధిక ధర పలికిన టాప్ 5 భారతీయ మహిళా క్రికెటర్లు వీరే.. 

  1. స్మృతి మందాన-రూ.3.4 కోట్లు (బెంగళూరు)
  2. దీప్తి శర్మ-రూ.2.60 కోట్లు (యూపీ)
  3. జెమీమా రోడ్రిగ్స్‌-రూ.2.20 కోట్లు (ఢిల్లీ)
  4. షెఫాలీ వర్మ-రూ.2 కోట్లు (ఢిల్లీ)
  5. పూజా వస్త్రాకర్‌-రూ.1.90 కోట్లు (ముంబై)

భారతీయ ప్లేయర్లు: ఉమెన్స్ ప్రిమియర్‌ లీగ్‌ వేలంపాటలో స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, దీప్తిశర్మ చరిత్ర సృష్టించారు. స్మతి మందానను వేలంపాటలో బెంగళూరు ప్రాంఛైజీ 3.4 కోట్లకు దక్కించుకుంది. అటు దీప్తిశర్మను యూపీ 2.60 కోట్లకు కొనుగోలు చేయగా, జెమీమా రోడ్రిగ్స్‌ను 2.20 కోట్లు, షెఫాలీ వర్మ-రూ.2 కోట్ల రూపాయలకు ఢిల్లీ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఇక మిడిలాడర్‌ బ్యాటర్‌, బౌలర్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాయి ప్రాంఛైజీలు. పూజా వస్త్రాకర్‌-రూ.1.90 కోట్లు, యస్తికా భాటియా-రూ.1.50 కోట్లు, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌-రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ప్రాంఛైజీ. ఇక రిచా గోష్‌-రూ.1.90 కోట్లు, రేణుకాసింగ్‌ ఠాకూర్‌-రూ.1.50 కోట్లకు బెంగళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. హర్లీన్‌ డియోల్‌ను గుజరాత్‌ జట్టు 40 లక్షలకు కొనుగోలు చేసింది.

అత్యధిక ధర పలికిన టాప్ 5 ఓవర్సీస్ మహిళా క్రికెటర్లు వీరే.. 

  1. ఆసీస్ ప్లేయర్ గార్డెనర్-రూ.3.2 కోట్లు (గుజరాత్‌)
  2. నటాలియా బ్రంట్‌-రూ.3.20 కోట్లు (ముంబై)
  3. బెత్‌ మూనీ-రూ.2 కోట్లు (గుజరాత్‌)
  4. ఎల్లీస్‌ పెరీ-రూ.1.70 కోట్లు (బెంగళూరు)
  5. సోఫి ఎకల్‌స్టన్‌-రూ.1.8 కోట్లు (యూపీ)

ఓవర్సీస్ ప్లేయర్లు: ఇక విదేశీ ప్లేయర్లను కూడా డబ్య్లూపీఎల్ ప్రాంఛైజీలు పోటీపడి మరీ వేలంపాటలో తమ సొంతం చేసుకున్నాయి. ఆసీస్ ప్లేయర్ గార్డెనర్-రూ.3.2 కోట్లు , బెత్‌ మూనీ-రూ.2 కోట్లకు గుజరాత్‌ ప్రాంఛైజీ దక్కించుకుంది. నటాలియా బ్రంట్‌-రూ.3.20 కోట్లకు ముంబై ప్రాంఛైజీ, ఎల్లీస్‌ పెరీ-రూ.1.70 కోట్లు ,సోఫి డివైన్‌-రూ.50 లక్షలకు బెంగళూరు ప్రాంఛైజీ సొంతం చేసుకుంది. ఇక సోఫి ఎకల్‌స్టన్‌-రూ.1.8 కోట్లు , తహిళా మెక్‌గ్రాత్‌-రూ.1.45 కోట్లు యూపీ ప్రాంఛైజీ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

ఉమెన్స్ ప్రిమియర్‌ లీగ్‌ వేలంపాటలో తెలుగు ప్లేయర్లు..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్- 2023 వేలంలో ఏపీలోని కర్నూలుజిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణి అదరగొట్టింది. వేలంలో ఈ లెఫ్టార్మ్ పేసర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈమె కోసం యూపీ వారియర్‌, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు రూ. 55 లక్షలకు యూపీ వారియర్‌ సొంతం చేసుకుంది. అలాగే మరో తెలుగు ప్లేయర్ ఎస్ యశశ్రీని యూపీ వారియర్స్ రూ.10 లక్షలకు తమ సొంతం చేసుకుంది. బీసీసీఐ ఆండర్19 వన్డేలకు హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ప్లేయర్.. జరగబోయే డబ్య్లూపీఎల్ టోర్నీలో తన సత్తా చాటాలని చూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!