Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya Wedding: మొదలైన హార్దిక్ పెళ్లి సందడి, తనయుడి సాక్షిగా సాంప్రదాయంగా వివాహ వేడుకలు..

బాజా బజంత్రీలు, బరాత్ తో మరోసారి పెళ్లి చేసుకుంటున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. నాల్గు రోజులపాటు రాజస్థాన్ వేదికగా వేడుక గ్రాండ్ గా జరుగుతుంది.

Hardik Pandya Wedding: మొదలైన హార్దిక్ పెళ్లి సందడి, తనయుడి సాక్షిగా సాంప్రదాయంగా వివాహ వేడుకలు..
Hardik Pandya Wedding
Follow us
Surya Kala

|

Updated on: Feb 14, 2023 | 8:11 AM

భారతీయ సంప్రదాయంలో పెళ్లి వెరీ వెరీ స్పెషల్.. బంధువులు, స్నేహితులు సందడి, భాజాభజంత్రీలు, విందు, వినోదం అన్ని కలిస్తే భారతీయ వివాహ వేడుక. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ స్థాయికి తగిన విధంగా పెళ్లివేడుకలను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే లాక్ డౌన్ సమయంలో చాలామంది తమ పెళ్లివేడుకలను సామాన్యంగా చేరుకున్నారు. అటువంటి వారిలో చాలామంది తమ పెళ్లి కూడా ఘనంగా సన్నిహితుల మధ్య జరిగి ఉంటె బాగుండుని అని ఒక్కసారైనా ఆలోచిస్తారు. మరి ఇలాంటి ఆలోచన టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కు కూడా వచ్చినట్లుంది. దీంతో  మరోసారి పెళ్లికి రెడీ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..

ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న హార్ధిక్.. ఇప్పుడు జరిగేది రెండో పెళ్లి కాదని క్లారిటీ ఇచ్చాడు. తన భార్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ నే మరోసారి పెళ్లి చేసుకుంటున్నట్లు హార్ధిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఫిబ్రవరి 14న లవర్స్ డే సంద్భంగా హార్దిక్ – న‌టాషా జోడీ ఘనంగా పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈమేరకు రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ లో వేడుకకు వేదికను ముస్తాబు చేశారు. ఫిబ్రవ‌రి 13 నుంచి ఫిబ్రవ‌రి 16 వ‌ర‌కు నాల్గు రోజులపాటు వేడుకలు జరుగుతున్నట్లు టాక్. నాలుగు రోజ‌ల్లో హ‌ల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో నటాషా రింగ్ తొడిగిన పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో 2020 కరోనా లాక్‌డౌన్‌లో ఈ ఇద్దరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఓ కొడుకును కూడా కనేశారు. తన బాబుకి అగస్త్య పాండ్య అని పేరు పెట్టారు. అయితే లాక్ డౌన్ సమయంలో బాజా బజంత్రీలు, బంధువుల హడావిడా లేకుండా కేవలం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న హార్దిక్, నటాసా మనసులో చిన్న నిరూత్సాహం ఉండడంతో .. ఇప్పుడు ఆత్మీయులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో సంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే రాజస్థాన్ లో నాలుగు రోజుల పెళ్లి చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది.