WPL Auction: డబ్ల్యూపీఎల్ వేలం హిట్టు.. ఫ్రాంచైజీల వారీగా జట్లు, కెప్టెన్ల వివరాలు ఇవిగో.!

ముంబై వేదికగా జరిగిన తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ఆక్షన్ ముగిసింది. 448 మంది క్రికెటర్లు ఈ వేలంలో పేరు నమోదు చేసుకోగా.. మొత్తం 87 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు.

WPL Auction: డబ్ల్యూపీఎల్ వేలం హిట్టు.. ఫ్రాంచైజీల వారీగా జట్లు, కెప్టెన్ల వివరాలు ఇవిగో.!
Wpl Auction
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 14, 2023 | 8:30 AM

ముంబై వేదికగా జరిగిన తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ఆక్షన్ ముగిసింది. 448 మంది క్రికెటర్లు ఈ వేలంలో పేరు నమోదు చేసుకోగా.. మొత్తం 87 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్స్, 47 మంది భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇక వీరి కోసం ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్లు వెచ్చించాయి. అలాగే ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అత్యధిక ధర రూ. 3.4 కోట్లుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

ఇక టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆక్షన్‌లో మొదటి పేరు కాగా.. ఈమెను ముంబై ఇండియన్స్ రూ.1.80 కోట్లకు దక్కించుకుంది. అటు విదేశీ మహిళా ప్లేయర్స్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్ రూ. 3.20 కోట్లకు ముంబైకి ఆడనుండగా, ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లీ గార్డనర్‌‌ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.

జట్లు, కెప్టెన్ల వివరాలు ఇవిగో:

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఇంద్రాణి రాయ్, దిశా కసత్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా శోభన, ఎరిన్ బర్న్స్, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, కోమల్ ఖేమ్‌నార్, షుట్, సహానా పవార్

  • ముంబై ఇండియన్స్:

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, ప్రియాంక బాలా, హుమైరా కాజీత, నీలమ్ బిష్త్, నీలం బిష్త్ సోనమ్ యాదవ్

  • యూపీ వారియర్స్:

సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ(కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్‌వాడ్, పార్షవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్ యశశ్రీ, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, లారెన్ షావ్, లారెన్ షావ్, లారెన్ షావ్

  • ఢిల్లీ క్యాపిటల్స్:

జెమిమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ(కెప్టెన్), రాధా యాదవ్, శిఖా పాండే, మారిజానే కప్ప్, టైటాస్ సాధు, అలిస్ క్యాప్సే, తారా నోరిస్, లారా హారిస్, జసియా అక్తర్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, తానియా భాటియా. జెస్ జోనాస్సేన్, స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మోండల్

  • గుజరాత్ జెయింట్స్:

ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ(కెప్టెన్), సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, స్నేహ్ రాణా, ఎస్ మేఘన, జార్జియా వేర్‌హామ్, మాన్సీ జోషి, దయాళన్ హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, అశ్వని కుమారి, షబ్మాన్ షకీల్