Camphor Benefits: రూ.2 కర్పూరంతో ఎన్ని జబ్బులను నయం చేయవచ్చో..! తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..
పూజలో ఉపయోగించే కర్పూరాన్ని ఆయుర్వేదంలో ఔషధంగా కూడా వాడతారు. ఎందుకంటే కర్పూరంలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో
మన హిందూ ధర్మంలో నిత్య పూజలో, వంటలో ఉపయోగించే పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవిగానే, ప్రయోజనకరంగా ఉంటాయి. బహుశా వాటి ప్రయోజనాల గురించి తెలిసే వాటిని పవిత్రంగా భావించేవారు మన పూర్వీకులు. అటువంటి పదార్థాలు, వస్తువులలో కర్పూరం కూడా ఒకటి. దీనిని ఎక్కువగా దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పూజలో ఉపయోగించే ఈ కర్పూరాన్ని ఆయుర్వేదంలో ఔషధంగా కూడా వాడతారు. ఎందుకంటే కర్పూరంలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రెండు రూపాయలకే లభించే సహజ కర్పూరం శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోని నెగిటీవ్ ఎనర్జీని తరిమికొట్టడానికి ఉపయోగించే ఈ కర్పూరం.. దాని సువాసన పరిమళం మనుసుకు సాంత్వన చేకూరుస్తుంది. మరి ఈ కర్పూరంతో ఏయే సమస్యలను అధిగమించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాలు
- రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కర్పూరం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై వచ్చే వాపు, మొటిమలు మరియు జిడ్డును కూడా తొలగిస్తుంది.
- జలుబు, ఫ్లూలో కర్పూరం చాలా మేలు చేస్తుంది. జలుబు లేదా దగ్గు ఉన్నట్లయితే కర్పూరాన్ని గోరువెచ్చని ఆవాల నూనెతో కలిపి మర్దన చేయాలి.
- ఒకరి నోటిపై మొటిమలు, మరక ఏదైనా ఉంటే, దానిని కర్పూరంతో తొలగించవచ్చు. కొబ్బరినూనెలో కర్పూరం కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు తొలగిపోయి చర్మం బాగుంటుంది.
- ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కర్పూరం మిశ్రమాన్ని లేపనంగా వాడతారు.
- కర్పూరంతో కూడిన బామ్‌ను రాస్తే మెడనొప్పి క్షణాల్లో ఎగురుపోతుంది.
- శొంఠి, అర్జున బెరడు, తెల్ల చందనంతో కలిపి కర్పూరం రాసుకుంటే తలనొప్పి దూరమవుతుంది.
- వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు తగ్గుతుంది.
- ప్రస్తుత రోజుల్లో జట్టు ఊడిపోతుంది.ఈ సమస్యకు కర్పూరంతో చెక్ పెట్టవచ్చు. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు కొబ్బరినూనెలో కర్పూరం కలిపి రాసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.
- పాదాల్లో నొప్పి, వాపు సమస్య ఉంటే కర్పూరంలో నూనె కలిపి మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి