Magnesium Deficiency: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్లే.. వెంటనే ఇలా చేయండి..
మనం తీసుకునే ఆహారంలో అన్ని ఇతర పోషకాలతోపాటు మెగ్నీషియం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ ఖనిజం శరీరంలో ఎన్ని రకాల విధులకు తోడ్పుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపించిందేంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి.

మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం సరైన పోషకాల మిశ్రమంతో సమతుల్యంగా ఉండాలని వైద్యులు తరచుగా చెబుతుంటారు. దీనికి ప్రధానకారణం ఏంటంటే..ఈ పోషకాలన్నీ ఒక్కొక్కొటి శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరంలో ఏదైనా పోషకం లోపం తలెత్తిదంటే దాని ప్రభావం ఏదొక రూపంలో కనిపిస్తుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు బయటపడతాయి. అందుకే వైద్యుల వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం లోపించినట్లయితే జ్వరం, పోషకాలు ఖనిజాల లోపం, నిద్రలేమి, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదిరక్తంలో చక్కెరను నియంత్రించడం, కండరాలు, నరాలు దృఢత్వం, గుండె పనితీరును నిర్దారించడం వంటి కీలకమైన శరీర విధులను నిర్వహిస్తుంది. అంతేకాదు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మనం తినే ఆహారంలోని మెగ్నిషియం చాలా వరకు ఎముకల సాంద్రతను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో తగినంత మెగ్నీషియం లేనట్లయితే బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. మెగ్నీషియం ఆకుకూరల్లో సమృద్ధిగా లభిస్తుంది. తృణధాన్యాలు, ధాన్యాలు, గింజలు, చిక్కుళ్ళు కూడా మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇంకే ఇతర ఆహారపదార్థాల్లో మెగ్నిషియం లభిస్తుందో తెలుసుకుందాం.
గుమ్మడి గింజలు :




గుమ్మడి గింజల్లో మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. ఈ గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. సలాడ్‌లలో, రాత్రిపూట స్మూతీ బౌల్స్‌లో లేదా స్నాక్‌గా ఉపయోగించవచ్చు. వేయించి తీసుకోవడం కంటే, వాటిని పచ్చిగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు ఎక్కువ అందుతాయి.
అరటిపండ్లు :
అరటిపండు మనకు ఏకాలంలోనైనూ లభ్యం అవుతుంది. ఈ పండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీనిని స్మూతీస్‌లో, రాత్రిపూట ఓట్స్‌తో లేదా ఫ్రూట్ ప్లేట్‌లో భాగంగా తీసుకోవచ్చు. మీరు ఉదయాన్నే మొదటగా అరటిపండు తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
బ్రౌన్ రైస్ :
మీరు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్రౌన్ రైస్ పాలిష్ తక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్స్, మినరల్స్ తోపాటు మెగ్నీషియం కూడా లభిస్తుంది. మీ డిన్నర్ ప్లేటులో బ్రౌన్ రైస్ తరచుగా తీసుకునేలా చేసుకోండి
పెరుగు :
పెరుగులో ఎన్నో సహజగుణాలు ఉంటాయి. రోజుకో కప్పు పెరుగు తింటే మీ ఎముకలు బలంగా ఉంటాయి. మీ మధ్యాహ్న భోజనంలో ఒక గిన్నె పెరుగు తీసుకుంటే అద్భుతాలు చేయగలదు. ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్ లక్షణాలతో పాటు, పెరుగు మెగ్నీషియం యొక్క మంచి మూలం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం