High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో ప్రాణాంతక వ్యాధులు.. పరిశోధకుల షాకింగ్‌ నివేదికలు!

ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో కొలెస్ట్రాల్‌ సమస్య పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్‌ అనేది రోజురోజుకు విస్తరిస్తోంది..

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో ప్రాణాంతక వ్యాధులు.. పరిశోధకుల షాకింగ్‌ నివేదికలు!
Cholesterol
Follow us

|

Updated on: Feb 13, 2023 | 5:00 AM

ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో కొలెస్ట్రాల్‌ సమస్య పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్‌ అనేది రోజురోజుకు విస్తరిస్తోంది. భారతదేశంలో15-20 శాతం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25-30 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్‌ అన్ని శరీర కణాలలో కనిపించే కొవ్వు లాంటి పదార్థం. దీని కారణంగా కొలెస్ట్రాల్‌ గుండె ఆరోగ్యం, గుండె జబ్బులు, స్టోక్స్ కు ప్రధాన కారణంగా మారుతోంది. మరో వైపు దేశంలో మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒక నివేదిక ప్రకారం.. ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ నుంచి 12 మంది పెద్దలలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు పరిశోధకుల నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 74 మిలియన్ల కంటే ఎక్కువ మంది మధుమేహం రోగులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

  1. గుండె పనితీరు మందగించడం: గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, క్లినికల్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ ఇమేజింగ్ డైరెక్టర్, హెడ్ డాక్టర్ వినాయక్ అగర్వాల్ , హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ అనేవి కార్డియోవాస్కులర్ డిసీజ్ స్పెక్ట్రం పెరుగుదలకు దారితీసే అత్యంత సాధారణ ప్రమాద కారకాల గురించి గతంలో తెలియజేశారు. కొలెస్ట్రాల్‌ కారణంగా గుండె సమస్యలు, గుండె పనితీరు మందగించడం, ఇతర సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. అధిక కొలెస్ట్రాల్‌ ఎక్కువ గుండెకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం మరింత పొంచివుండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. టైప్ 2 మధుమేహం అనేది దీర్ఘకాలిక పరిస్థితి. జీవనశైలి, శరీర బరువు, ఆహారపు అలవాట్ల కారణంగా మరింత తీవ్రత ఉండే అవకాశం ఉంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు గుండె జబ్బులకు దోహదపడే లిపిడ్ ప్రొఫైల్‌లను కలిగి ఉంటారు.
  2. వ్యాయామంతో ఆరోగ్యం: సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. జీవనశైలి మార్పులు చేసుకోవడం తప్పనిసరి. వారానికి నాలుగైదు రోజుల పాటు కనీసం 40 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గడం, తక్కువ జంక్ ఫుడ్, పిజ్జాలు, చిప్స్ వంటి వాటిని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజుల్లో పిల్లలు కూడా జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అది వారి బరువు, ఆరోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించడం మంచిది. ముందు జాగ్రత్త వల్ల నివారణ చర్యలు చేపట్టవచ్చంటున్నారు నిపుణులు. వేయించిన ఆహారాన్ని తగ్గించడం ఎంతో మంచిది. అలాగే జంక్ ఫుడ్‌, అర్థరాత్రి సమయంలో తినడం మంచిది కాదంటున్నారు.
  3. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం: సాధారణంగా కొన్ని కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మంచివైతే.. మరి కొన్ని చెడుకు దారి తీస్తాయి. అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవి కావు. పిజ్జాలు, బర్గర్లలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి. కానీ అవకాడోలు, నెయ్యి, కొబ్బరికాయలోవి ఆరోగ్యానికి మంచివి. అందుకని మీ డైట్‌కి ఆరోగ్యకరమైన కొవ్వులను జతచేయటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
  4. మాంసపు పదార్థాలు అధికంగా తినడం: మీరు మాంసాహారులైతే, దాదాపు ప్రతిరోజూ మాంసం వంటకాలు తినేవారైతే మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోమాంసం, పందిమాంసం వంటి మాంసాలు తినటం వలన కొలెస్ట్రాల్ మరింత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు దాని బదులు సన్నని మాంసాలైన చికెన్, సముద్రపు ఆహారం వంటి ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవడం మంచిది.
  5. అధిక బరువు పెరగడం: అధిక కొలెస్ట్రాల్ పలు వ్యాధులకు కారణమవుతాయి. అధిక కొలెస్ట్రాల్ బరువు పెరగటానికి కారణమైతే, బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతుంది. అందుకని మీ కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం మీరు బరువు, శరీరంలో కొవ్వు స్థాయి రెండూ తగ్గించుకోవడం మంచిది. కఠినమైన డైట్, వ్యాయామం వంటివి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి.
  6. మానసిక ఒత్తిడి: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. దీని వల్ల తలనొప్పుల నుంచి, మానసిక ఒత్తిడి మరీ కాన్సర్ లాంటి భయంకర రోగాలకి కూడా కారణమవ్వచ్చు. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.
  7. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం: కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం అంటే సరైన జీవన విధానం ఉండాలి. అలానే మందులు కూడా వేసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు మందులు ఉపయోగిస్తే మంచిది. ఇక మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని చూస్తే.. ఆల్కహాల్, పొగాకుకి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే హై కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలానే తీసుకునే ఆహారం విషయానికి వస్తే.. సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బరువు బాగా పెరగకుండా చూసుకోవాలి. అధిక బరువు వంటి వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..