AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makhana Side Effects: మఖానాతో ఇన్ని అనర్థాలా.. వీటి పోషకాలతో వారికి పెను ప్రమాదం

బరువు తగ్గాలనుకునేవారికి, ఆహార నియమాలు పాటించే వారికి పరిచయం అక్కరలేని పేరు పూల్ మఖానా. దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి సోషల్ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా సమాచారం లభిస్తోంది. మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, అసలు సమస్యంతా వీటి గురించి పూర్తిగా తెలియకుండా ఎక్కువ మొత్తంలో తినేవారికే కలుగుతుంది..

Makhana Side Effects: మఖానాతో ఇన్ని అనర్థాలా.. వీటి పోషకాలతో వారికి పెను ప్రమాదం
తామర గింజలను అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు మరియు శరీరంలోని ఇతర భాగాలలో కాల్సిఫికేషన్ పెరుగుతుంది. దీనివల్ల దంత గాయాలు, చర్మపు దద్దుర్లు, మూత్రపిండాల్లో రాళ్లు మరియు కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మఖానాలో పొటాషియం ఉంటుంది. కానీ ప్యాక్ చేసిన మఖానాలో అదనపు ఉప్పు ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిని పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
Bhavani
|

Updated on: Feb 25, 2025 | 10:34 AM

Share

ఇటీవల 2025-26 కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌లో మఖానా బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఈ సాధారణ మఖానా గింజలకు మరింత ప్రజాదరణ కలగనుంది. దీనిని ఫాక్స్ సీడ్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ తామర గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్, విటమిన్లు ఉండటం వల్ల వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. వీరిని తరచుగా ఆహారంగా తీసుకుంటే సులువుగా బరువు తగ్గడంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది.. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాల కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మఖానా వీరికి మంచిదే..

మఖాన అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే కెలోరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే మఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫిట్ నెస్ ప్రపంచంలో వీటికి మంచి ఆదరణ ఉన్నప్పటికీ అధిక మొత్తంలో పూల్ మఖానా తీసుకుంటే లేని రోగాలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు వైద్యులు.

మలబద్ధకాన్ని కలిగిస్తుంది..

మఖానా ఎంతో తేలికగానే జీర్ణమయ్యే స్నాక్. అయినప్పటికీ వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అది మలబద్ధకానికి దారితీస్తుంది. ఇక వేసవిలో మామూలుగానే ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. కడుపు ఉబ్బరం, విరేచనాలను కూడా కలుగజేస్తుంది. కాబట్టి మోతాదు మించకుండా వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

కాల్షియంతో సమస్యలు..

మఖానాలో కాల్షియం అధికమొత్తంలో లభిస్తుంది. వాటిని కాల్షియం లేమితో బాధపడేవారు కచ్చితంగా తీసుకోవాలి. అయితే, మోతాదు మించి తీసుకుంటే మాత్రం ఇందులోని కాల్షియం నిల్వలు శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. దీని వల్ల శరీరంలోని పలు ప్రాంతాల్లోల కాల్సిఫికేషన్ ఏర్పడుతుంది. ఇదంత మంచిది కాదు.

గుండె జబ్బుల రిస్క్..

మఖానా వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి కొంత రిస్క్ అనే చెప్పాలి. దీనిని సరైన విధంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మితిమీరి తిన్నప్పుడు ఇది గుండెజబ్బుల రిస్క్ ఉన్న వారికి ఆ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి.

అలెర్జీల ప్రమాదం..

మఖానాను అతిగా తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు రావచ్చు. ఇది ఇతరత్రా చర్మ సమస్యలు కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లకు కూడా మఖానా కారణమవుతుంది. కాబట్టి ఎంత మితంగా వీటిని తీసుకుంటే ఈ న్యాచురల్ పోషకాహారం అంత చక్కగా ఒంటికి పడుతుంది.

Follow Us