AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తున్నారా..? భారీ మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త..

గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లీకేజీలు జరిగితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశముంటుంది. అయితే గ్యాస్ సిలిండర్లపై రాసి ఉండే కోడ్‌లు భద్రతను నిర్ధారించడంలో సహాయపడతాయి. సిలిండర్ తీసుకునేముందు వీటిని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కోడ్‌ల గురించి తెలుసా..

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తున్నారా..? భారీ మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త..
Gas Cylinders
Venkatrao Lella
|

Updated on: Jun 15, 2026 | 7:48 AM

Share

ప్రతీఒక్కరి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల డొమెస్టిక్ సిలిండర్ ధరలు రూ.30 మేర పెరగడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలో రూ.60 పెంచగా.. ఇటీవల మరోసారి పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇది ఇలా ఉంచితే సిలిండర్‌పై అనేక గుర్తులు ఉంటాయి. కొన్ని ఆక్షరాలు, నెంబర్లు రాసి ఉంటాయి. అవి చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటికి అర్థం ఏంటనేది మనలో చాలామందికి తెలిసి ఉండకపొవచ్చు. కానీ వాటి అర్ధం ప్రతీఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను సురక్షితంగా ఉపయోగించుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశముంటుంది.

ఈ గుర్తులకు అర్థం ఏంటి..?

మీరు గ్యాస్ సిలిండర్లను చూస్తే వాటిపై A-26, B-27, D-28 లాంటి కోడ్‌లు ఉంటాయి. వీటికి అర్థం ఏంటనేది తెలియక చాలామంది పట్టించుకోరు. కానీ మీరు ఇంట్లో సిలిండర్‌ను సురక్షితంగా వాడుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. సిలిండర్ భద్రతను నిర్ధారించడంలో ఆ గుర్తులు ఉపయోగపడతాయి. ఈ కోడ్‌లను చూసి సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్ అని అనుకుంటారు. కానీ అసలు అర్థం అది కాదు. మీ సిలిండర్‌కు సేఫ్టీ టెస్ట్ మళ్లీ ఎప్పుడు చేయాలనే విషయాన్ని ఈ కోడ్‌లు తెలియచేస్తాయి. సిలిండర్ పైభాగంలో ఉండే మెటల్ రింగ్ మీద అక్షరాలు, నెంబర్లతో కూడిన ఈ కోడ్‌లు ఉంటాయి. A అనేది జనవరి నుంచి మార్చిని సూచిస్తోంది. B ఏప్రిల్ నుంచి జూన్‌ను, C జూలై నుంచి సెప్టెంబర్, D-అక్టోబర్ నుంచి డిసెంబర్‌ను సూచిస్తోంది.

సిలిండర్ తీసుకునేముందు చెక్ చేస్కోండి

ఇక 25,26 నెంబర్లు ఇయర్‌ను సూచిస్తాయి. ఉదాహరణకు మీ సిలిండర్‌పై B-26 అని రాసి ఉంటే.. 2026 ఏప్రిల్-జూన్ మధ్యలో సేఫ్టీ టెస్ట్ చేయాలని అర్థం. D-28 అని ఉంటే 2028 అక్టోబర్-డిసెంబర్ మధ్య సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని అర్థం. మీరు గ్యాస్ తీసుకునేటప్పుడు సిలిండర్లపై ఈ నెంబర్లను చెక్ చేస్కోండి. గడువు తేదీ  దాటిన సిలిండర్ మీకు అందిస్తే గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి సిలిండర్ మార్చుకోండి. సిలిండర్లు పాతవి అయ్యే కొద్ది తుప్పు పట్టడం, లీకులు కావడం వంటివి చోటుచేసుకుంటాయి. దీంతో వాటికి ఎప్పటికప్పుడు హైడ్రోస్టాటిక్ టెస్టులు ఈ కోడ్‌లు నమోదు చేస్తారు. మళ్లీ సిలిండర్‌కు టెస్ట్ ఎప్పుడు చేయాలనే విషయాన్ని ఈ కోడ్‌లు సూచిస్తాయి. టెస్టుల్లో సిలిండర్‌లో ఎలాంటి సమస్య లేదని తేలితే కొత్త డేట్ ప్రింట్ చేస్తారు. అదే సమస్యలు ఉంటే సిలిండర్‌ పనికిరానిదిగా గుర్తించి మార్కెట్లోకి పంపించరు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి