AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa Ghosh : కేవలం 17 బాల్స్.. 200 స్ట్రైక్ రేట్.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రిచా ఘోష్

Richa Ghosh : పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్‌తో 34 పరుగులు సాధించింది.

Richa Ghosh : కేవలం 17 బాల్స్.. 200 స్ట్రైక్ రేట్.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రిచా ఘోష్
Richa Ghosh
Rakesh
|

Updated on: Jun 15, 2026 | 6:53 AM

Share

Richa Ghosh : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌పై భారీ స్కోరు సాధించడమే కాకుండా పలు వ్యక్తిగత రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ లోయర్ ఆర్డర్‌లో వచ్చి పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆమె ఒక చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారతదేశం తరఫున 6వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రికార్డును రిచా తన పేరిట లిఖించుకుంది.

200 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్

పాకిస్తాన్‌తో జరిగిన ఈ ఆరో మ్యాచ్‌లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్‌తో 34 పరుగులు సాధించింది. ఇందులో ఒక భారీ సిక్సర్, 5 అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రిచా ఘోష్ పూనకాలు వచ్చినట్లు ఆడింది. ఆ ఓవర్లో వరుసగా 4 ఫోర్లు బాదడంతో కేవలం ఆ ఒక్క ఓవర్లోనే భారత జట్టుకు ఏకంగా 23 పరుగులు లభించాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్లే టీం ఇండియా 170 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది.

మొదట్లోనే షాకిచ్చిన పాక్ బౌలర్లు

అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం అస్సలు బాగా లేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 6 రన్స్ చేసి మొదటి ఓవర్లోనే అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ కూడా 7 బంతుల్లో కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. దీనితో భారత జట్టు కేవలం పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా నిర్మించారు.

స్మృతి మంధాన హాఫ్ సెంచరీ క్లాస్

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించింది. ఆమె కేవలం 44 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్ల సహాయంతో 68 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36 రన్స్ చేసి చాలా బాధ్యతాయుతంగా ఆడింది. కరెంట్ సిట్యుయేషన్‌కు తగ్గట్టుగా కెప్టెన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో ప్లస్ అయింది. ఆఖరిలో దీప్తి శర్మ కూడా 9 బంతుల్లో 12 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు తీయగా, తస్మియా రుబాబ్, రామీమ్ షమీమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us