Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thati Bellam: తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తప్పక తింటారు..

తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాలలో, ఆహారాన్ని జీర్ణం చేయటానికి తిన్న తర్వాత తప్పకుండా చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు.

Thati Bellam: తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తప్పక తింటారు..
Thati Bellam
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2022 | 1:07 PM

Thati Bellam Benefits : కరోనా కల్లోలం తర్వాత ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. భిన్న రూపాంతరాలతో భయపెడుతున్న కరోనా లాంటి వైరస్‌ల బారిన పడకుండా పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి కనుక చాలా మంది పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా రసాయనాలతో పండించిన వాటిని పక్కన పెట్టి ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం తాటి బెల్లం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉందని అనేక ఆరోగ్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. మరి తాటి బెల్లంలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ఆహారాన్ని జీర్ణం చేయటానికి తిన్న తర్వాత తప్పకుండా చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తోంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇంకా తాటి బెల్లంలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఆస్తమా ని తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నిమంత్రిస్తుంది. ఇదిలో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది.

తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. తాటి బెల్లం లో ఫైబర్ల ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్స్ మలబద్ధకం మరియు అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపిస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది. వాస్తవానికి, ఇది పొడి దగ్గు . ఆస్త్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. మైగ్రెయిన్ తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉదయాన్నే 1 tsp తాటి బెల్లం తీసుకుంటే మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి