AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: వానాకాలంలోనే డెంగ్యూ ఎందుకు వ్యాపిస్తుంది? దీని లక్షణాలు, నివారణ మార్గాలు..

వానాకాలంలో డెంగ్యూ ముప్పు ఎక్కువగా ఉంటుంది . అనేక మంది డెంగ్యూని సాధారణ జ్వరంగా భావించి అలక్ష్యం చేస్తుంటారు. ఐతే సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని మీకు తెలుసా! డెంగ్యూ కారణంగా శరీరంలో..

Dengue: వానాకాలంలోనే డెంగ్యూ ఎందుకు వ్యాపిస్తుంది? దీని లక్షణాలు, నివారణ మార్గాలు..
Dengue
Srilakshmi C
|

Updated on: Jul 10, 2022 | 12:39 PM

Share

Dengue fever symtoms: వానాకాలంలో డెంగ్యూ ముప్పు ఎక్కువగా ఉంటుంది . అనేక మంది డెంగ్యూని సాధారణ జ్వరంగా భావించి అలక్ష్యం చేస్తుంటారు. ఐతే సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని మీకు తెలుసా! డెంగ్యూ కారణంగా శరీరంలో ప్లేట్‌లెట్స్ స్థాయి గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా రోగి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. అనేక సందర్భాల్లో హెమరేజిక్ జ్వరం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌కు కూడా ఇది కారణమవుతుంది. అంతర్గత రక్తస్రావం, కడుపులో నీరు చేరడం వంటి అసాధారణ పరిస్థితులకు దారితీస్తుంది. వర్షాకాలంలో జలమయమయిన ప్రాంతాల్లో డెంగ్యూ లార్వా వృద్ధి చెంది, త్వరగా వ్యాపిస్తుంది. గతేడాది కూడా వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కవల్జిత్ సింగ్ తెలిపారు. డెంగ్యూ జ్వరంతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సందర్భంగీ తీసుకోవల్సిన కొన్ని ముఖ్య జాగ్రత్తలు మీకోసం..

లక్షణాలు ఇవి.. సాధారణంగా డెంగ్యూ జ్వరం లక్షణాలు మూడు నుంచి ఐదు రోజుల్లో కనిపించడం ప్రారంభమవుతాయి. మొదట.. తేలికపాటి జ్వరం, తలనొప్పి ఉంటుంది. కండరాల నొప్పి, అలసట, వాంతులు లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు తీవ్రమైతే చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. ప్లేట్‌లెట్స్ కౌంట్ వేగంగా పడిపోతుంది. చాలా సందర్భాలలో, బిపి కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది.

తీసుకోవల్సిన జాగ్రత్తలు..

ఇవి కూడా చదవండి

సాధారణ డెంగ్యూ ఇంట్లోనే నయమవుతుంది. ఇందుకోసం ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జ్వరం వస్తే పారాసిటమిల్ తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో చికిత్స చేస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.

డెంగ్యూని ఎలా నివారించాలి..

  • ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి
  • కూలర్లు, ఇతర పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే మార్చాలి.
  • ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
  • నిద్రపోయేటప్పుడు దోమతెర ఉపయోగించాలి.

డెంగ్యూ సోకితే ఈ జాగ్రత్తలు పాటించాలి..

  • శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి.
  • కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవాలి.
  • ప్లేట్‌లెట్ కౌంట్‌ను చెక్ చేస్తూ ఉండాలి.
  • దానిమ్మ, బొప్పాయి, ఆకుపచ్చ కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి.