పండక్కి మీరు కొన్న స్వీట్స్… మీ ఎక్స్‌పైరీ డేట్‌కి ప్రమోషన్ కార్డ్స్..!
దీపావళి వేళ స్వీట్లు చూసి టెంప్ట్ అవుతున్నారా? వెరైటీ ఐటమ్స్ ఒకదాని వెనుక లొట్టలేసుకుంటూ లాగించేద్దామని డిసైడ్ అయ్యారా? అయితే ఒక్క నిమిషం ఆగండి..! స్వీట్లపైన ఉండే సిల్వర్ కోట్ బదులు.. అల్యూమినియం ఫాయిల్స్ వాడుతున్నారు వ్యాపారులు. అది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. స్వీట్లతో పాటు అల్యూమినియం ఫాయిల్స్ తింటే క్యాన్సర్ ఖాయమని హెచ్చరిస్తున్నారు.
దీపావళి వేళ స్వీట్లు చూసి టెంప్ట్ అవుతున్నారా? వెరైటీ ఐటమ్స్ ఒకదాని వెనుక లొట్టలేసుకుంటూ లాగించేద్దామని డిసైడ్ అయ్యారా? అయితే ఒక్క నిమిషం ఆగండి..! స్వీట్లపైన ఉండే సిల్వర్ కోట్ బదులు.. అల్యూమినియం ఫాయిల్స్ వాడుతున్నారు వ్యాపారులు. అది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. స్వీట్లతో పాటు అల్యూమినియం ఫాయిల్స్ తింటే క్యాన్సర్ ఖాయమని హెచ్చరిస్తున్నారు. సిల్వర్ ఫాయిల్స్‌కి ప్రత్యామ్నాయంగా అల్యూమినియం ఫాయిల్స్ ఉపయోగిస్తున్నారు కొంతమంది స్వీట్స్ షాపు వ్యాపారులు. కారణం.. సిల్వర్ రేటు పెరగడమేనట.
అయితే అల్యూమినియం కోట్ వాడితే కఠినంగా వ్యవహరిస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్స్ వాడకంతో గ్యాస్ట్రిక్, బోన్స్ సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. నరాలపై ప్రభావంతో పాటు క్యాన్సర్ కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




