Epidemic : బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. నిర్ధారణ, చికిత్సకు కేంద్రం మార్గదర్శకాలు
Black fungus an epidemic : తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధుల జాబితాలో చేర్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది..
Black fungus an epidemic : తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధుల జాబితాలో చేర్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ కొవిడ్ నుంచి కోలుకున్న వారిని మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇన్‌ఫెక్షన్ కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897) కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఫలితంగా ఇకపై బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ను రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. కాగా, తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించి కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. అటు కరోనా.. ఇటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు బ్లాక్ ఫంగస్ నిర్ధారణ, చికిత్సకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అనుసరించాలని కూడా కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
ఇలాఉండగా, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న కరోనా రోగులకు ఆక్సిజన్ ఇచ్చేటపుడు అనుసరించిన అసురక్షిత మార్గమే ఈ బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి అతిపెద్ద కారణమని భావిస్తున్నారు. వాస్తవానికి, పారిశ్రామిక ఆక్సిజన్ కంటే వైద్య సేవల్లో వాడే ఆక్సిజన్ చాలా స్వచ్ఛమైనది. కచ్చితంగా 99.5% స్వచ్చమైన ఆక్సిజన్ ఉంచిన సిలిండర్లు నిరంతరం శుభ్రం చేయబడతాయి. అవి రోగ సంక్రమణ రహితమైనవి. ఈ ఆక్సిజన్ అధిక ప్రవాహంలో రోగులకు ఇచ్చినప్పుడు, తేమ అవసరం అవుతుంది. ఇందుకోసం అది క్రిమిరహితం చేసిన నీటితో నిండిన కంటైనర్ గుండా వెళ్ళేలా చేస్తారు. పధ్ధతి ప్రకారం ఈ నీటిని క్రిమిరహితం చేసి నిరంతరం భర్తీ చేయాలి. ఒకవేళ నీటిని క్రిమిరహితం చేయకపోతే, అది బ్లాక్ ఫంగస్ మూలంగా మారుతుంది. ముఖ్యంగా హైఫ్లో ఆక్సిజన్ రోగులకు ఎక్కువ కాలం ఇస్తున్నప్పుడు ఇది ప్రమాదకరంగా మారుతుంది. తేమ లేకుండా ఆక్సిజన్ ఇస్తే, అది ముఖ్యమైన అవయవాలను రక్షించే శ్లేష్మ పొరను ఆరిపోయేలా చేసి ఊపిరితిత్తుల పొరను దెబ్బతీస్తుంది. మలం ఇంకా, లాలాజలం మందంగా తయారవుతుంది. అది శరీరం నుండి బయటపడటం కష్టం అవుతుంది. తద్వారా రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
Read also : INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్’ నిష్క్రమణ నేడే