Health Tips: వామ్మో.. టీతో బ్రెడ్ తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి.. లేకపోతే ప్రమాదమే..
చాలా మంది ప్రజలు తమ రోజును కప్పు టీతో ప్రారంభించేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది టీతో బ్రెడ్, బిస్కెట్లు తినడానికి ఆసక్తి చూపుతారు.
చాలా మంది ప్రజలు తమ రోజును కప్పు టీతో ప్రారంభించేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది టీతో బ్రెడ్, బిస్కెట్లు తినడానికి ఆసక్తి చూపుతారు. కానీ టీతో బ్రెడ్ తినడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీతో బ్రెడ్ తినడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు చుట్టుముడతాయి. సాధారణంగా టీ కూడా ఎక్కువగా తగకూడదు. అలాంటి పరిస్థితుల్లో టీ తో కలిపి చక్కెర లేదా మైదా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. అయితే, టీతో బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
టీతో బ్రెడ్ తినడం వల్ల కలిగే నష్టాలు..
బరువు పెరుగుతుంది: బ్రెడ్‌ను ఎక్కువగా అన్ని రకాల పిండి పదార్థాలతో తయారు చేస్తారు. అంతేకాకుండా వాటిలో హానికరమైన రసాయనాలను సైతం కలుపుతారు. దానివల్ల వాటిని జీర్ణం చేసుకోవడం కష్టం. దీని వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలకు దారితీయడమే కాకుండా బరువు కూడా పెరగుతుంది. కావున మీరు కూడా టీతో బ్రెడ్ తినడానికి ఇష్టపడితే ఈరోజు నుంచే ఈ అలవాటును మార్చుకోవాలని సూచిస్తున్నారు.
బ్లడ్ షుగర్ పెరుగుతుంది: టీ – బ్రెడ్ తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల పరిస్థితి మరింత దిగజారుతుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు టీతో బ్రెడ్ తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
అధిక BP సమస్య: ఇది రక్తపోటు రోగులలో BP స్థాయిని మరింత పెంచుతుంది. అందువల్ల రక్తపోటు రోగులు మరచిపోయి కూడా ఉదయం టీతో బ్రెడ్ తినకూడదు.
పొట్టలో అల్సర్ల ప్రమాదం పెరుగుతుంది: మీరు ఉదయాన్నే బ్రెడ్‌తో టీ తీసుకుంటే ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. కావున కడుపు లైనింగ్ – ప్రేగులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా అల్సర్ ప్రమాదం పెరుగుతంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి