Home Remedies: మీ దంతాలు పసుపు రంగు మారుతున్నాయా..? అద్భుతమైన ఇంటి చిట్కాలు

మనిషికి దంతాలు ఎంతో ముఖ్యమైనవి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య తలెత్తితో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అలాగే దంతాలను శుభ్రంగా, తెల్లగా ఉంచుకోవడం..

Home Remedies: మీ దంతాలు పసుపు రంగు మారుతున్నాయా..? అద్భుతమైన ఇంటి చిట్కాలు
Teeth Problems
Follow us
Subhash Goud

|

Updated on: Oct 01, 2022 | 7:27 AM

మనిషికి దంతాలు ఎంతో ముఖ్యమైనవి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య తలెత్తితో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అలాగే దంతాలను శుభ్రంగా, తెల్లగా ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నిర్లక్ష్యం వల్ల చాలా సార్లు మన దంతాలు వాటి సహజ ప్రకాశాన్ని కోల్పోతాయి. చాలా సార్లు మనం కొన్ని ఆహారాలను తీసుకుంటాము. ఇవి మన దంతాల బయటి పొరను మురికిగా చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరి ముందు మాట్లాడాలన్నా, నవ్వాలన్నా సంకోచించడం మొదలుపెడతాం. దంతాల పసుపు రంగును తగ్గించడానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చు. దంతాల పసుపు రంగును తగ్గించడంలో ఇవి మీకు సహాయపడతాయి. తెల్లటి దంతాల కోసం మీరు ఏ రెమెడీస్ ప్రయత్నించవచ్చో తెలుసుకుందాం.

  1. వంట సోడా: మీరు దంతాల కోసం బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. మీరు దీన్ని టూత్ పౌడర్‌గా ఉపయోగించవచ్చు. దంతాల మీద కాసేపు రుద్దండి. ఆ తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. మీరు దీనికి కొన్ని చుక్కల నిమ్మరసం జోడించడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది. నిమ్మకాయ బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది దంతాల పసుపు రంగును తొలగించడంలో సహాయపడుతుంది.
  2. నారింజ, నిమ్మ తొక్కలు: నారింజ పండు తొక్క తీసి దాని కింది భాగాన్ని అంటే తెల్లని భాగాన్ని దంతాల మీద రుద్దండి. ఇందులోని తెల్లటి భాగంలో డి-లిమోనెన్ ఉంటుందని చెబుతున్నారు. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. నిమ్మ తొక్కలు దంతాలను శుభ్రం చేయడానికి, తెల్లగా చేయడానికి ఉపయోగిస్తారు. పై తొక్క తెల్లటి భాగంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కూడా దంతాలపై రుద్దితే తెల్లగా మెరిసిపోతాయి.
  3. పసుపు: పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇది దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు దంతాల కోసం పచ్చి పసుపును ఉపయోగించవచ్చు. దీని వేరును పేస్ట్‌లా చేసి దంతాలకు వాడండి. మీరు అర టీస్పూన్ కొబ్బరి నూనె, బేకింగ్ సోడాతో కలిపి ఒక టీస్పూన్ పసుపును ఉపయోగించి దంతాలపై రుద్దితో మంచి ఫలితం ఉంటుంది. దీన్ని టూత్‌పేస్ట్‌గా ఉపయోగించండి.
  4. కలబంద: కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. ఇది హోం రెమెడీగా పనిచేస్తుంది. ఇది దంతాలపై ఉండే పసుపు పొరను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ను తయారు చేయడానికి బేకింగ్ సోడాతో కలపండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆయిల్ పుల్లింగ్: దంతాలను శుభ్రం చేయడానికి మీరు ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది పురాతన ఆయుర్వేద నివారణ. ఒక చెంచా కొబ్బరి నూనెను నోటిలో వేసుకోవాలి. చుట్టూ తిప్పండి. కొన్ని నిమిషాల తర్వాత దాన్ని బయటకు తీయండి. ఇది దంతాల పసుపు రంగును తొలగించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి