Health Tips: కంటి చూపు పెరగాలంటే ఈ పండు తినండి.. ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

అవోకాడోలో విటమిన్ ఎ, సి, కెరాటిన్ ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. అయితే..

Health Tips: కంటి చూపు పెరగాలంటే ఈ పండు తినండి.. ప్రయోజనాలేంటో తెలుసుకోండి..
Avocado
Follow us

|

Updated on: Sep 30, 2022 | 10:45 PM

కళ్ళు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, వీటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. వాటికి తక్కువ విశ్రాంతిని అందిస్తాము. కంప్యూటర్‌లో పనిచేసే వ్యక్తులు స్క్రీన్‌పై 9-10 గంటలు గడుపుతారు. ఆ తర్వాత కూడా మొబైల్, టీవీలతో గడుపుతారు. స్క్రీన్‌తో ఎక్కువసేపు గడపడం వల్ల కళ్ల కండరాలు బలహీనపడి కంటిచూపు తగ్గుతుంది. కళ్ల మంచి ఆరోగ్యం కోసం విశ్రాంతి ఇవ్వడం అవసరం. అలాగే వారికి తగిన ఆహారం తీసుకోవడం కూడా అవసరం. మీరు కూడా మీ కంటి చూపును కాపాడుకోవాలనుకుంటే.. అవకాడో పండును తినండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన ఓ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ అవకాడో తింటే.. రక్తంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుందని వెల్లడించింది. ఈ పండ్లలో మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే ఉంటుంది.

అవోకాడో అనేది జామ లేదా పియర్ లాగా కనిపించే పండు. కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. అవకాడోలో విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కంటి చూపును పెంచడంలో ఇది చాలా మేలు చేస్తుంది. తాజా పరిశోధన ప్రకారం, అవకాడోలో కొలెస్ట్రాల్-తగ్గించే గుణాలు ఉన్నాయి.

అవోకాడో కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది..

అవోకాడోలో విటమిన్ ఎ, సి, కెరాటిన్ ఉన్నాయి, కాబట్టి ఇది కంటికి సంబంధించిన అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇది కాకుండా, యాంటీఆక్సిడెంట్లను త్వరగా గ్రహించడంలో సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం, అవోకాడోలో కెరోటినాయిడ్లు లుటిన్, జియాక్సంతిన్ కనిపిస్తాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో క్యాటరాక్ట్ వ్యాధిని రానివ్వవు. అవకాడోను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ ఇ కూడా అవకాడోలో లభిస్తాయి. ఈ విటమిన్లన్నీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. అవకాడోలో చాలా తక్కువ కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండెపోటును నివారిస్తుంది..

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యం ఉన్నందున అవకాడోను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండెపోటు రాకుండా కాపాడుతుంది. అవకాడో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిని వేగంగా తగ్గిస్తుంది. అవకాడో తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి 20 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కాకుండా, చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా 22 శాతం తగ్గుతుంది.

అందమైన, ఆరోగ్యమైన జుట్టు కోసం..

ఈ పండు విటమిన్ B2 (రిబోఫ్లేవిన్), విటమిన్ B3 (నియాసిన్) అందిస్తుంది. ఇది జుట్టు పొడవుగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles