TB Disease: టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్న వైద్య నిపుణులు! ఎందుకంటే..

భారత్‌తోసహా ప్రపంచవ్యాప్తంగా ప్రతీయేట క్షయవ్యాధి (TB) కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. TB వ్యాధి చాలా సందర్భాలలో ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయితే కొంతమందికి కిడ్నీ, మెదడు, వెన్నెముకలో కూడా TB వ్యాధి వస్తుంది. TB అత్యంత సాధారణ లక్షణం నిరంతర దగ్గు. అందుకే మూడు వారాల పాటు దగ్గు ఉంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని..

TB Disease: టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్న వైద్య నిపుణులు! ఎందుకంటే..
TB Disease in India
Follow us

|

Updated on: Mar 29, 2024 | 12:22 PM

భారత్‌తోసహా ప్రపంచవ్యాప్తంగా ప్రతీయేట క్షయవ్యాధి (TB) కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. TB వ్యాధి చాలా సందర్భాలలో ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయితే కొంతమందికి కిడ్నీ, మెదడు, వెన్నెముకలో కూడా TB వ్యాధి వస్తుంది. TB అత్యంత సాధారణ లక్షణం నిరంతర దగ్గు. అందుకే మూడు వారాల పాటు దగ్గు ఉంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే దగ్గు రాకపోయినా ఒక వ్యక్తి టీబీ బారిన పడతాడా? అనే సందేహం మీకు కలిగి ఉంటుంది. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది టీబీ రోగుల్లో దగ్గు వంటి లక్షణాలు కనిపించవని తాజా పరిశోధనలో వెల్లడైంది. ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. ఆసియాలో TBతో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో దగ్గు లక్షణాలు లేవని పేర్కొంది. శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఈ అధ్యయనంలో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే టిబి రోగులలో నిరంతర దగ్గు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయట నిజానికి, టీబీ రోగుల్లో దగ్గు లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం అని పరిశోధకులు అంటున్నారు. దగ్గు వంటి ప్రధాన లక్షణాలు రోగులలో ఎందుకు కనిపించవు అనే విషయంపై పరిశోధకులు మరింత కృషి చేయాలని నిపుణులు అంటున్నారు.

లేడీ హార్డింజ్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో హెచ్‌ఓడి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్‌హెచ్ ఘోటేకర్ మాట్లాడుతూ.. టీబీ రోగులలో నిరంతర దగ్గు చాలా ముఖ్యమైన లక్షణం. ఇక వేళ రోగిలో దగ్గు కనిపించకపోతే టీబీ వ్యాధిని సకాలంలో గుర్తించడంలో బాధితులు విఫలం అవుతారు. బాధితుల్లో దగ్గు లక్షణాలు కనిపించకపోవడం అనే విషయంపై పరిశోధకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లక్షణాలు కనిపించకపోతే టీబీని గుర్తించడంలో మరింత జాప్యం జరుగుతుంది. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఫలితంగా ఇతర అవయవాలకు కూడా టీబీ వ్యాపించే ప్రమాదం ఉంది. ఇది మరణానికి దారి తీసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో TB ఇతర లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా అవసరం. దగ్గు కాకుండా టీబీ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే ఇతర ఈ లక్షణాలు ఏవంటే..

ఇవి కూడా చదవండి

టీబీ ప్రధాన లక్షణాలు ఏవంటే..

  • బరువు వేగంగా తగ్గిపోవడం
  • రాత్రి వేళల్లో చెమటలు
  • ఎప్పుడూ అలసిపోతూ ఉండటం
  • ఛాతి నొప్పి
  • శ్లేష్మం, రక్తంతో దగ్గు

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లి్‌క్‌ చేయండి.