AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Bones: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా..? దృఢంగా మారాలంటే వీటిని తీసుకోవడం బెస్ట్‌..!

Healthy Bones: ప్రస్తుత రోజుల్లో మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాడు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి..

Healthy Bones: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా..? దృఢంగా మారాలంటే వీటిని తీసుకోవడం బెస్ట్‌..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 29, 2021 | 8:12 AM

Share

Healthy Bones: ప్రస్తుత రోజుల్లో మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాడు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి, ఆహార నియామాలు తదితర కారణాల వల్ల ఆరోగ్యం పాలయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే మంచి ఆరోగ్యానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఖనిజాలు, విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం ఎంతో ముఖ్యం. కండరాలు, ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఏ పనైనా చేయగలుగుతాం. విటమిన్‌ డి సాధారణంగా సూర్యకాంతి నుంచి ఎక్కువగా లభిస్తుంది. కానీ కాల్షియం ప్రధానంగా మనం తినే ఆహారం.. కూడా ఎముకల మీద ప్రభావం చూపుతుంది. ఎముకలలో సత్తువ కోల్పోవడం, ఇతర వ్యాధులను నివారించడానికి విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మందికి ఎములు బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్యం బారిన పడుతుంటారు. విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఇక్కడ చూద్దాం.

కొవ్వు చేపలు:

సాల్మన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉంచడమే గాక మనకు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఇది ఎముకలను కూడా బలపరుస్తుంది.

పాలు:

పాలు, ఇతర పాల ఉత్పత్తులు నెయ్యి, జున్ను, వెన్న మొదలైనవి ఎముకలను బలంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మనం పాలు తాగడం వల్ల శరీరంలోని ఎముకల సాంద్రత పెరుగుతుంది.

ఆకు కూరగాయలు:

ఇందులో పోషకాహారాలు అధిక సంఖ్యలో ఉంటాయి. బ్రోకలీ, క్యాబేజీ, కాల్షియం, బచ్చలికూర వంటి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది.

గుడ్డు:

గుడ్డు ప్రోటీన్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గుడ్డు లోని పచ్చసొన. శరీరంలో కాల్షియం, విటమిన్ డి స్థాయిలను పెంచుకోవాలనుకుంటే.. గుడ్డు పచ్చసొన తినడం మంచిది.

సోయా పాలు :

సోయా పాలు లేదా ఇతర సోయా ఆధారిత ఆహారాలు ఎముకల ఆరోగ్యానినికి ఎంతో మంచివి. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే ఎముకలను బలోపేతం చేయడంలో మెగ్నీషియం, పోటాషియం ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈరెండు పోషకాలు విత్తనాలు, కాయకూరలు, పాలు, అరటి పండ్లు, సోయాలో లభిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్‌ సి, విటమిన్‌ కె. విటమిన్‌ ఎ ఎంతో అవసరం.

ఇవీ కూడా చదవండి

Black Pepper Benefits: మిరియాలతో సులువుగా బరువు తగ్గొచ్చు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే

గర్భధారణ సమయంలో ఛాతి నొప్పి వస్తోందా.? అయితే నిర్లక్ష్యం చేయకండి.! ఇది తెలుసుకోండి..